5 Day Week: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో అటు జీతం ఇటు సెలవులు రెండూ పెరగడం ఖాయం
5 Day Week: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందనుంది. అటు జీతం, ఇటు సెలవులు రెండూ పెరగనున్నాయి. త్వరలోనే ఈ మార్పు అమల్లోకి రానుంది. పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం..
5 Day Week: కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోనున్న నిర్ణయంతో ఆ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది. అది కూడా ఒకేసారి రెండు విషయాల్లో లబ్ది చేకూరనుంది. వేతనం పెరగడమే కాకుండా పని దినాలు కూడా తగ్గనుండటంతో ఆ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేవు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోనున్న ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు వర్తించనుంది. బ్యాంకు ఉద్యోగులు ఎప్పట్నించో కోరుతున్న డిమాండ్లు తీరనున్నాయి. చాలాకాలంగా జీతాల పెంపు గురించి బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే అంటే డిసెంబర్ రెండు లేదా మూడవ వారంలో బ్యాంకు ఉద్యోగుల జీతాలు భారీగా పెరగవచ్చని అంచనా. అదే సమయంలో బ్యాంకు పనిదినాలు కూడా తగ్గనున్నాయి. అంటే బ్యాంకు ఉద్యోగులకు 5 డే వీక్ అమలు కానుంది. ఈ రెండు అంశాలపై ఇప్పటికే బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదం కానున్నాయని అంచనా. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగులకు జీతం ఒకేసారి 15 శాతం పెరగవచ్చని తెలుస్తోంది.
అదే విధంగా ఫైవ్ డే వీక్ అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి 5 డే వీక్ అంటే వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగాలు చాలాకాలంగా కోరుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన ఒప్పందం 2022 నవంబర్ 1న ముగిసింది. బ్యాంకు యూనియన్లు కొత్త వేతన ఒప్పందం కోసం ఏదురుచసూస్తున్నారు. ఇది అమలైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్‌కు కూడా వర్తించనుంది. 2020 జూలై నెలలో దేశవ్యాప్తంగా 8,50 వేల మంది బ్యాంకు ఉద్యోగుల జీతాలు 15 శాతం పెరిగాయి. అప్పట్లో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇప్పుడు త్వరలో బ్యాంకు యూనియన్లు కొత్త ఒప్పందం కుదుర్చుకుని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించనున్నారు. కొత్త పనిదినాలు అమల్లోకి వచ్చే ఉద్యోగులకు చాలా విశ్రాంతి లభించవచ్చు.
Also read: Free Ration Scheme: ఉచిత రేషన్ బియ్యం పథకం మరో ఐదేళ్లు పొడిగింపు, మహిళా సంఘాలకు ద్రోన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook