Banks Minimum Balance: మినిమమ్ బ్యాలెన్స్, జరిమానాల సమస్య ఇక లేనట్టేనా
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఇకపై ఉండదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే విధించే జరిమానాలకు ఇక స్వస్తి చెప్పనున్నారు.
చాలామందికి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల తరచూ జరిమానా పడుతుంటుంది. ఇకపై రానున్న రోజుల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. వివిధ బ్యాంకుల సేవింగ్, కరెంట్ ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే లిమిట్ వేర్వేరుగా ఉంటుంది. ఇటీవల జన్‌ధన్ ఎక్కౌంట్ల కార్యక్రమంలో ప్రతి భారతీయుడికి బ్యాంక్ ఎక్కౌంట్ ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. జన్‌ధన్ ఎక్కౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
ఎక్కౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విషయమై ఆర్ధిక సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావ్ కరాడ్ కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల నిర్దేశక మండలి త్వరలో బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించే విధానానికి స్వస్తి చెప్పనుందని చెప్పారు. జరిమానాలకు స్వస్తి చెప్పే నిర్ణయాన్ని బ్యాంకుల మండలి తీసుకోవచ్చన్నారు.
మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విషయంలో మీడియా ఆర్ధిక సహాయ మంత్రిని ప్రశ్నించింది. ప్రతి నెలా కనీస బ్యాలెన్స్ లేని ఎక్కౌంట్లపై విధించే జరిమానాను తొలగించే అంశం కేంద్రం పరిశీలిస్తుందా అని మీడియా ప్రశ్నించింది. వివిధ ఆర్ధిక ప్రణాళికలపై సమీక్ష కోసం ఆర్ధికశాఖ సహాయ మంత్రి జమ్ము కశ్మీర్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook