New Feature in Whats App: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌ ఫైల్స్ షేరింగ్ పరిమితిని పెంచుతూ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. వాట్సాప్‌లో ప్రస్తుతం మెజేజ్‌లు, డాక్యుమెంట్స్‌.. మీడియా ఫైల్స్‌ను పంపవచ్చు.. మీడియా ఫైల్స్ షేరింగ్‌పై వాట్సాప్ పరిమితులు విధించింది.. మీడియా ఫైల్స్ 100 MB కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను వాట్స్‌ప్ ద్వారా షేర్ చేసుకోవడానికి వీలుకాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో పెద్ద సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను షేర్ చేయలేకపోతున్నామంటూ గత కొంత కాలంగా యూజర్లు పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. యూజర్ల ఇబ్బందిని తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో దీని కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వెల్లడించింది.


వాట్సాప్ పరిచయం చేయనున్న సరికొత్త ఫీచర్‌తో 2GB సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను సైతం పంపుకోవచ్చు.. ప్రస్తుతం వాట్సాప్ పరీక్షల దశలో ఉంది. త్వరలో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సెల్ ఫోన్‌ల కెమెరాలు అధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. అధిక సామర్థ్యంతో చిత్రీకరించే ఫోటో.. వీడియో హై క్వాలిటీతో స్టోర్ అవుతున్నాయి. 


ఆ ఫైల్ సైజు ఎక్కువగా ఉండడంతో షేర్ చేసుకోవడానికి వీలు కావడం లేదు. యూజర్ల అభ్యర్థన మేరకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త వాట్సాప్ ఫీచర్‌లో మీడియా ఫైల్ షేరింగ్ ఫైల్ సైబు లిమిట్ 2GBకి పెంచనుంది.


Also read: PVR-Inox Mega Merger: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో మెగా విలీనం... ఒక్కటైన పీవీఆర్, ఐనాక్స్


Also read: Ola E-scooter Fire: ఓలా ఈ-స్కూటర్​లో మంటలు- వైరల్ అవుతున్న వీడియో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook