Google Pay App Service: గతంలో డబ్బులు పంపించాలంటే అతి కష్టంగా ఉండేది. ఇప్పుడు క్షణాల్లోనే ఎక్కడి నుంచైనా.. ఎక్కడికైనా నగదు లావాదేవీలు చేసే సదుపాయం లభించింది. అరచేతి నుంచి లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నాం. ఇవన్నీ ఆన్‌లైన్‌ ద్వారా సాధ్యమవుతున్నది. అయితే వాటిని మరింత సులువుగా యూపీఐ పేమెంట్ల ద్వారా జరుగుతున్నాయి. వీటిలో అత్యధికంగా వినియోగించేది గూగుల్‌ పే. కోట్లాది మంది వినియోగిస్తున్న గూగుల్‌ పే సేవలు ఇకపై బంద్‌ కానున్నాయి. భారత్‌, సింగపూర్‌ మినహా కొన్ని దేశాల్లో ఆ సేవలు ఆగిపోనున్నాయి. ఈ మేరకు ఆ కంపెనీ ప్రకటించింది. జూన్‌ 4 తర్వాత ఆపివేస్తున్నట్లు తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?


ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌లో అత్యంత ప్రజాదరణ పొందినది గూగుల్‌ పే. ఈ యాప్‌ సేవలు చాలా దేశాల్లో కొనసాగుతున్నాయి. భారత్‌లో విశేష ఆదరణ పొందుతున్న ఈ యాప్‌ ఇతర దేశాల్లో కొంత తక్కువ వినియోగిస్తున్నారు. గూగుల్‌ పే కన్నా గూగుల్‌ వాలెట్‌ వినియోగిస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో గూగుల్‌ పే సేవలను నిలిపివేసి గూగుల్‌ వాలెట్‌ సేవలను పెంచనున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రజలకు గూగుల్‌ విజ్ఞప్తి చేసింది. జూన్‌ 4వ తేదీ తర్వాత గూగుల్‌ పే సేవలు ఉండవని స్పష్టం చేసింది. ఆలోపు వినియోగదారులు అందరూ గూగుల్‌ వాలెట్‌ను మారిపోవాలని సూచించింది.

Also Read:  వ్యాపారం చేయడానికి రూ. 5000 వేలు కూడా లేనివ్యక్తి.. నేడు రూ. 16,900 కోట్లకు అధిపతి..


గూగుల్‌ పే కన్నా గూగుల్‌ వాలెట్‌ను ప్రపంచ దేశ ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఒక్క భారత్‌లో మాత్రమే గూగుల్‌ పేను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే 180 దేశాల్లో గూగుల్‌ పే స్థానంలో గూగుల్‌ వాలెట్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో పేకు బదులు వాలెట్‌ వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ పే సేవలు నిలిపివేసినా కూడా భారత్‌తోపాటు సింగపూర్‌లో యథావిధిగా ఆ సేవలు కొనసాగనున్నాయి. దీంతో భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఇప్పుడు వినియోగిస్తున్న గూగుల్‌ పేను వాడుకోవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter