Google Ads: ప్రస్తుతం మొబైల్ మనం ఎదైన వస్తువు కానీ, ఎదైన విషయం గురించి టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే చాలు..క్షణాల్లోనే దానికి సంబంధించిన యాడ్స్ మన ఫోన్‌లో కనిపించి మనల్ని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మనం వాడే యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కడ చూసిన అవే యాడ్‌ రోజంతా ప్రత్యేక్షమవుతాయి. ఇలా మరుతున్న టెక్నాలజీ మనని ఎప్పటికప్పుడు అనుసరిస్తునే ఉంది. ఈ యాడ్స్‌ల విషయంలో గూగుల్‌ మనకి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి ఫోన్‌లలో యాడ్స్‌ను తొలగించడానికి నూతన ఫీచర్‌ను తీసుకు వస్తున్నట్లు ప్రముఖ గూగుల్‌ సంస్థ ప్రకటించింది. యాడ్స్‌ల విషయంలో గూగుల్‌ తెలిపిన వివరాలను తెలుసుకుందా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీలక ప్రకటన:


యాడ్స్‌కు సంబంధించిన అంశంపై గూగుల్‌ సంస్థ యాన్యువల్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ ఓ అదిరిపోయే ప్రకటన చేసింది. అన్ని యాడ్స్‌ను నియంత్రించేందుకు గూగుల్‌  ‘మై యాడ్‌ సెంటర్‌’ సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు ప్రకటించింది. ఈ ఆప్షన్ ద్వారా వారు కావాలనుకున్న యాడ్స్‌ను  మాత్రమే ఎంచుకొని చూడొచ్చు. అయితే గూగుల్ ఈ సరికొత్త ఫీచర్‌ని ఏడాది చివరన వినియోగదారులకు అందించనున్నట్లు గూగుల్ సంస్థ పేర్కొంది.


ఎలా పనిచేస్తుంది?


గూగుల్‌  సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కేవలం వినియోగదారులు కావాలనుకుంటున్న ప్రకటనలను మాత్రమే సెలెక్ట్ చేసుకుని చూడొచ్చని సంస్థ పేర్కొంది. ముఖ్యంగా వినియోగదారుడు పర్సనలైజ్‌డ్‌ యాడ్స్‌ను ఆఫ్‌ చేసుకునే విధంగా కొన్న ఆప్షన్‌ తీసుకురానున్నారు. ప్రకటనలను ను కంట్రోల్‌ చేసి బ్లాక్‌, లైక్‌, రిపోర్ట్‌ వంటి ఫీచర్లను కూడా ఇందులో అమర్చనున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను గూగుల్‌ త్వరలోనే తెలపనుంది.


Also Read: Minister KTR Twit: అచ్ఛే దిన్ అంటే ఇదేనా..మంత్రి కేటీఆర్ ట్వీట్..ప్రధాని కౌంటర్.!


Also Read: Cholesterol Control Tips: ఈ 4 పుడ్స్ మీ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, వీటిని వెంటనే డైట్ లో చేర్చుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.