Alert for Smart Phone Users: గూగుల్ సంచలన నిర్ణయం.. స్మార్ట్ ఫోన్ లలో ఇక ఆ యాప్ లు పనిచేయవు
How to Do Call Recording without App: వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. గూగుల్ తన పాలసీలో అనేక మార్పులు చేయబోతోంది. ఈ మార్పులన్ని మే 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
How to Do Call Recording without App: వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. గూగుల్ తన పాలసీలో అనేక మార్పులు చేయబోతోంది. ఈ మార్పులన్ని మే 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా థర్డ్-పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌లను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇక నుంచి థర్డ్ పార్టీ యాప్స్‌కు సంబంధించి కాల్ రికార్డ్ యాప్స్ సేవలను నిలిపి వేయనున్నట్లు గూగుల్ తెలిపింది. గతంలో కాల్ రికార్డ్ సౌకర్యాన్నిఆపిల్ కూడా నిపివేసింది. ప్రస్తుతం కాల్ రికార్డ్ ఫీచర్ కావాలనుకునే వారి పరిస్థితి సందిగ్ధంలో ఉంది.
ఇది సులభమైన మార్గం:
Android ఫోన్‌లలో Google ఇంటర్నెట్ కాల్ రికార్డింగ్ సౌకర్యాన్ని అందించింది. అయితే భద్రత లోపాల వల్ల సేవలను నిలిపి వేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడకుండా.. ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
#ముందుగా ఏదైనా నంబర్‌కు కాల్ చేయండి.
#ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌పై జాగ్రత్తగా చూడండి. మీకు కాలింగ్ రికార్డింగ్ చిహ్నం కనిపిస్తుంది.
#మీరు ఆ ఐకాన్‌పై నొక్కాలి. దీంతో కాల్ రికార్డింగ్ ప్రారంభమవుతుంది.
#మీకు స్క్రీన్‌పై కాల్ రికార్డింగ్ ఐకాన్ కనిపించకపోతే.. కాల్ సెట్టింగ్‌లకు వెళ్లాళి.
#కాల్ సెట్టింగ్‌లో రికార్డింగ్ ఫీచర్ కనిపిస్తుంది.. దాన్ని ఆన్ చేయండి.
ఇలా కూడా చేయోచ్చు:
మీ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ రికార్డింగ్ ఫీచర్ లేకపోతే.. ఫోన్‌లో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి రెండవ ఫోన్‌లో సాధరణ రికార్డింగ్ ఆప్షన్‌ను ఆన్ చేయండి.
Also Read: Saturday Shani Mantra: శనివారం ఈ 3 మంత్రాలు పఠిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..
Also Read: SVP Pre Release Event: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుక..అతిధులెవంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook