Income Tax Returns 2020-21: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగించిన సీబీడీటీ
Income Tax Returns 2021 Filing Deadline Extended: వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు తుదిగడువు పొడిగించింది. అదే విధంగా కంపెనీలకు ఒకనెల పొడిగించింది. నవంబర్ 30 వరకు కంపెనీలు ఐటీఆర్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకుప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (CBDT) మరోసారి ఊరట కలిగించింది. గత ఆర్థిక సంవత్సరం 2020 - 21కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు (Income Tax Returns)కు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు తుదిగడువు పొడిగించింది. అదే విధంగా కంపెనీలకు ఒకనెల పొడిగించింది. నవంబర్ 30 వరకు కంపెనీలు ఐటీఆర్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆదాయపన్ను చట్టం ప్రకారం.. తమకు ఆడిటింగ్ అవసరం లేనివారు, సాధారణంగా ఐటీఆర్-1, ఐటీఆర్-4 కింద ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖాలు చేసేవారికి జూలై 31 వరకు గడువు ఇచ్చింది. తమ లావాదేవీలు, ఖాతాలుకు ఆడిటింగ్ చేయించే వారికి, కంపెనీలకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 వరకు సీబీడీటీ అవకాశం ఇచ్చింది. కరోనా కష్టకాలంలో గత ఏడాది తరహాలోనే ఐటీఆర్ దాఖలుకు మరింత గడువు ఇచ్చామని, సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఫామ్ 16ను జూలై 15, 2021లోగా ఇవ్వాలని పేర్కొంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం
అదే విధంగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. ఆలస్యంగా చేసిన ఐటీ రిటర్న్స్, సవరించిన ఐటీ రిటర్స్స్ దాఖలుకు నూతన గడువును 31 జనవరి 2022కు పెంచినట్లు తెలిపింది. ఆర్థిక సంస్థలు తమ ఆర్థిక లావాదేవీల నివేదిక (Statement of Financial Transaction) సమర్పించేందుకు తుది గడువను జూన్ 30 వరకు పెంచారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడంలో భాగంగా గడువు పొడిగించినట్లు నాంగియా అండ్ కో ఎల్‌ఎల్‌పీ భాగస్వామి శైలేష్ కుమార్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook