General Provident Fund New Interest Rates: ఇటీవల చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచి శుభవార్త అందించిన కేంద్ర ప్రభుత్వం.. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌) ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం షాక్ ఇచ్చింది.  2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి జీపీఎఫ్‌తో సహా ఇతర ప్రావిడెంట్ ఫండ్‌లపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే తాజాగా ప్రకటించిన వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వీటి వడ్డీ రేటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (పీపీఎఫ్‌) వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. ఇటీవల పీపీఎఫ్‌ వడ్డీ రేటులో కూడా ఎలాంటి మార్పు జరగని విషయం తెలిసిందే. దీంతో జీపీఎఫ్‌ వడ్డీ రేట్లు కూడా పెరగలేదు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీపీఎఫ్‌ చందదారుల డిపాజిట్లపై 7.1 శాతం చెల్లిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్), కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్‌, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే.  


జీపీఎఫ్‌ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే  ప్రావిడెంట్ ఫండ్. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ జీతంలో కొంత మొత్తాన్ని జీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో జమ చేసిన మొత్తాన్ని.. పదవీ విరమణ చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును అందిస్తున్న విషయం తెలిసిందే. 


Also Read: Salman Khan New Car: సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది  


ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ)పై జూన్ త్రైమాసికానికి 7.7 శాతం వడ్డీని ఆఫర్ చేసింది. అంతకుముందు జనవరి-మార్చి త్రైమాసికానికి ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు 7 శాతంగా ఉండేది. సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు జూన్ త్రైమాసికంలో పథకం 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. ఒక ఏడాది పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు. మూడేళ్ల కాల డిపాజిట్ వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. ఐదేళ్ల కాల డిపాజిట్ వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  


Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి