Harley Davidson New Electric Bike: అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ రానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద దీన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. S2 Del Marగా చెబుతున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ ఏడాది జూన్-ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మిడిల్-వెయిట్ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైన భాగాలు బ్యాటరీ, ఇన్వర్టర్, ఛార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటార్‌ వంటివి ఎలక్ట్రిక్ బైక్‌ మోడల్‌కి సంబంధించినవే ఉంటాయి. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీ కేవలం ఈ ఒక్క ఎలక్ట్రిక్ బైక్‌‌ తయారీకి మాత్రమే కాదు. అవే భాగాలతో విభిన్నమైన మోడల్స్, డిజైన్స్‌ను రూపొందిస్తుంది.


యారో ఆర్కిటెక్చర్ ద్వారా 21,7000 రకాల సిలిండ్రికల్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌ కోసం హార్లే డేవిడ్సన్ ఉపయోగిస్తోంది. ఇదే ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్ వంటి కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఎస్2 డెల్ మార్ మిడిల్ వెయిట్ విభాగానికి చెందినదే అయినప్పటికీ... ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా లైటర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా తయారుచేస్తారు.


హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్‌ ఇప్పటికే తైవాన్‌కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ Kymcoతో టైఅప్ అయింది. భవిష్యత్తులో ఈ రెండు సంస్థలు కలిసి యారో ఆర్కిటెక్చర్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. 


Also Read: Virat Kohli Break: విరాట్​ కోహ్లీకి బ్రేక్​- వెస్డీడీస్​తో మూడో టీ20కి దూరం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook