Harley-Davidson x440 Price, Features: ఇండియాలో అధిక సంఖ్యలో హార్లే డేవిడ్‌సన్ బైక్స్ విక్రయించి భారీ మొత్తంలో లాభాలను ఆర్జించే లక్ష్యంలో భాగంగా హార్లే డేవిడ్‌సన్ X440 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. హార్లే డేవిడ్‌సన్ X440 బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.29 లక్షల వద్ద ప్రారంభం కానుంది. " హార్లే డేవిడ్‌సన్ ఇప్పటివరకు తీసుకొచ్చిన మోటార్‌సైకిల్స్ లైనప్‌లో ఇదే అత్యంత తక్కువ స్థానంలో లాంచ్ అయిన బైక్ " అని ఆ కంపెనీ స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధరతో పోల్చితే, హార్లే డేవిడ్‌సన్ X440 ధర రూ. 30,000 మాత్రమే ఎక్కువ కానుంది. హీరో మోటోకార్ప్ సహకారంతో డిజైన్ చేసిన ఈ మోటార్ సైకిల్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. హార్లే డేవిడ్‌సన్ X440 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా ఫార్టీ టూ, యెజ్డీ రోడ్‌స్టర్ పేరిట మూడు మోడల్స్‌లో ఈ బైక్ అందుబాటులో ఉంది. జూలై 5న లాంచ్ కానున్న ట్రయంఫ్ స్పీడ్ 400 వంటి బైకులకు ఈ బైక్ గట్టి పోటీ ఇవ్వనుంది అని హార్లే డేవిడ్‌సన్ కంపెనీ భావిస్తోంది. 


మెకానికల్ స్పెసిఫికేషన్స్‌ని ముందుగా పరిశీలిస్తే, హార్లే-డేవిడ్‌సన్ X440 ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్‌‌తో వచ్చే 27 Bhp, 38 Nm గరిష్టమైన టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఇంజన్. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ అమర్చారు. బ్రేక్స్ విషయానికొస్తే.. 320 mm ఫ్రంట్ డిస్క్, 240 mm వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అలాగే బ్రేక్స్ అప్లై చేసే సమయంలో సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంది. ఇక టైర్ల విషయానికొస్తే, 18" ఫ్రంట్ (100/90), 17" (140/70) రీయర్ వీల్స్‌తో లభిస్తోంది.


హార్లే డేవిడ్‌సన్ X440 డిజైన్ : 
హార్లే డేవిడ్‌సన్ X440 బైక్ ఎంతో విలక్షణమైన లుక్‌తో ఆకర్షిస్తోంది. పూర్తిగా మెటల్‌తో రూపొందించిన ఫ్రంట్ ఫెండర్, రియర్ ఫెండర్, సీమ్లెస్ ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ కవర్స్ వంటి ఫ్యాక్టర్స్ ఈ మోటార్‌సైకిల్ గొప్పతనాన్ని విశ్లేషిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ DRL తో కూడిన ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌, టెయిల్ ల్యాంప్స్, డిఫ్యూజ్ లైటింగ్ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టూరింగ్ సీట్, బ్యాక్ రెస్ట్, బార్ ఎండ్ మిర్రర్స్, ఫాగ్ ల్యాంప్స్, విండ్‌స్క్రీన్, శాడిల్ బ్యాగ్స్ మోటార్‌సైకిల్ లుక్‌ను మార్చేస్తాయి. 


హార్లే డేవిడ్‌సన్ X440 ఫీచర్లు : 
టిఎఫ్టీ డిజిటల్ డిస్‌ప్లేతో 3.5 అంగుళాల స్పీడోమీటర్ అమర్చారు. ఇది డే అండ్ నైట్ ‘కనెక్ట్ 2.0’ ఫీచర్‌తో రెండు రకాల డిస్‌ప్లే మోడ్స్‌లో చూపిస్తుంది. కనెక్ట్ 2.0 ఫీచర్‌తో 25 కంటే ఎక్కువ నోటిఫికేషన్స్‌ని డిస్‌ప్లే పై చూపిస్తుంది.


సేఫ్టీ : అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఇగ్నిషన్ అలర్ట్, పానిక్ అలర్ట్, క్రాష్ అలర్ట్, టాపుల్ అలర్ట్, తక్కువ ఫ్యూయల్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.


సెక్యురిటీ : బైకుని ఎవ్వరూ చోరీ చేయడానికి వీల్లేకుండా థెఫ్ట్ అలర్ట్, బ్యాటరీని ఎవరైనా మీ అనుమతి లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తే వెంటనే హెచ్చరిక రావడం, జియోఫెన్స్ అలర్ట్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ వంటి మోడర్న్ ఫీచర్స్ ఈ హార్లే డేవిడ్‌సన్ X440 బైక్ సొంతం.


ఇది కూడా చదవండి : SUVs With 300km - 630km Range: 300 కిమీ - 630 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు


వెహికిల్ కండిషన్ : ప్రస్తుతం వాహనం కండిషన్ ఎలా ఉంది, ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా ? లేదంటే తదుపరి సర్వీస్ బుకింగ్ ఎప్పుడు, హిస్టరీ ఏంటి అనే అంశాలను స్పష్టంగా చూపిస్తుంది.


డ్రైవింగ్ రిపోర్ట్ : ఓవర్-స్పీడ్, ట్రిప్ అనాలిసిస్ డ్రైవింగ్ స్కోర్ వంటి డ్రైవింగ్ అలర్ట్స్ సైతం అందిస్తుంది. 


ఇదిలావుంటే, త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ 750CC ఇంజన్ బైక్ కూడా లాంచ్ అవబోతున్న సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి : First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK