EdelGive Hurun India Philanthropy List 2022: దాతృత్వంలో తగ్గేదే లే అంటున్నారు  ఐటీ టైకూన్ శివ్ నాడార్. సంపాదనలో ఎక్కువ భాగం దాతృత్వానికి ఖర్చు పెడుతూ సమాజంపై తనకు గల ప్రేమను మరోసారి నిరూపించారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2022లో హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్ నాడార్(Shiv Nadar) తొలిస్థానంలో నిలిచారు. శివ్ నాడార్ ఏడాది వ్యవధిలో రూ.1161 కోట్ల మేర అంటే రోజుకు రూ.3 కోట్లు  చొప్పున దానం చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ వార్షిక విరాళం రూ.484 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో వరుసగా రెండేళ్లు అజీమ్ ప్రేమ్‌జీ తొలి స్థానంలో నిలిచారని ఆ జాబితా గుర్తు చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో స్థానంలో ముకేశ్‌ అంబానీ కుటుంబం(రూ.411 కోట్లు), నాలుగో స్థానంలో బిర్లా కుటుంబం (రూ.242 కోట్లు) ఉంది. భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రూ.190 కోట్ల రూపాయల విరాళంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్ ప్రకారం, పదిహేను మంది వార్షికంగా రూ.100 కోట్లకు పైగా విరాళాలు అందించగా, 20 మంది రూ.50 కోట్లకుపైగా, 43 మంది రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందించారు. ఈ జాబితాను 1, 2021 నుండి మార్చి 31, 2022  వరకు ఇచ్చిన నగదు, నగదుతో సమానమైన వాటిని పరిగణనలోకి తీసుకుని రూపొందించారు.


దేశంలోనే అత్యంత దానశీలి అయిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా ఎల్‌ అండ్‌ టీ  గ్రూప్‌ ఛైర్మన్‌ నాయక్‌ (రూ.142 కోట్ల)  నిలిచారు. జెరోధాకు చెందిన నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌ తమ వితరణను 300 శాతం పెంచి రూ.100 కోట్లకు చేర్చారు. మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకులు సుబ్రోతో బాగ్చి, ఎన్‌.ఎస్‌. పార్థసారధి రూ.213 కోట్లు చొప్పున డొనేషన్ చేయడం ద్వారా టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితా ప్రకారం, అత్యంత వితరణశీలి అయిన మహిళగా రోహిణి నీలేకని (రూ.120 కోట్ల) నిలిచారు. 


Also Read: EPFO Update: దీపావళికి ముందే మీ పీఎఫ్ ఖాతాల్లో జమకానున్న 81 వేల రూపాయలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter