HDFC Interest Rate: హోమ్ లోన్స్ తీసుకునేవారికి నిరాశే, హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంపు
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
మే 9, 2022 నుంచి ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సి హోమ్ లోన్ వడ్డీ రేట్లను 30 పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 30 పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఫలితంగా నెలనెల కట్టే హోమ్ లోన్ ఈఎంఐలు కూడా పెరగనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది.
రెపో రేటును ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా 4.40 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లలో రెపో రేటు పెంచడం ఆర్బీకు ఇదే తొలిసారి.హెచ్‌డీఎఫ్‌సి కంటే ముందు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు రుణ, డిపాజిట్ రేట్లను పెంచేశాయి. ఆర్బీఐ నిర్ణయం తరువాత చోటుచేసుకున్న పరిణామాలివి. అదే ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు లెండింగ్ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచాయి. బాహ్య బెంచ్ మార్కులను పరిగణలో తీసుకుని ఈబీఎల్ఆర్ లెండింగ్ రేటును బ్యాంకులు నిర్ధారిస్తాయి. ఇందులో రెపో రేటు, రివర్స్ రెపో రేటు వంటి అన్ని అంశాలు తోడవుతాయి. ఈబీఎల్ఆర్ అనేది బ్యాంకుల్నించి తీసుకునే రుణాలపై ఉండే కనీస వడ్డీ రేటు.
Also read: Mahindra Atom Price: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంఛ్ చేయనున్న మహీంద్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.