HDFC Bank FD rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!
HDFC Bank FD rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల ఆరంభం నుంచే అమలులోకి వచ్చాయి.
HDFC Bank has increased the interest rates on FDs: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్)లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం (HDFC Bank increases interest rate) తీసుకుంది.
క్రితంతో పోలిస్తే దాదాపు 10 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. పెంచిన వడ్డీ రేట్లు డిసెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం రన్ అవుతున్న వివిధ కాలపరిమతులతో కూడిన ఎఫ్డీలకు పెంచిన వడ్డీ రేట్లు (HDFC Bank FDs interest rates) వర్తించనున్నట్లు తెలిపింది బ్యాంక్.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
36 నెలల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్డీలపై ప్రస్తుతం 6.05 శాతం వడ్డీ లభిస్తుండగా.. ఇకపై 6.1 శాతం వడ్డీ (New Interest rate of HDFC bank) లభించనుంది.
60 నెలల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు.. 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్.
సీనియర్ సిటిజన్లకు అదిరే ఆఫర్..
కొత్తగా తమ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్న సీనియర్ సిటిజన్లకు అదిరే ఆఫర్ ప్రకటించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే వీరికి 25 బేసిస్ పాయింట్ల వడ్డీ అధనంగా చెల్లించే ఆఫర్‌ను (HDFC Bank offer for senior citizens) కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఐసీఐసీఐ ఎఫ్డీపై కొత్త వడ్డీ రేట్లు..
ప్రైవేటు రంగానికి చెందిన మరో దిగ్గజ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల (ICICI Bank revised interest rates) సవరించింది.
7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితితో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లను అమలులోకి తెచ్చింది. అయితే సవరించిన వడ్డీ రేట్లు కొత్తగా ఎఫ్డీ ఖాతా ఓపెన్ చేసే వారికి, రెన్యువల్స్‌కు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ (ICICI Bank FD interest rates) స్పష్టం చేసింది.
7 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్‌పై సాధారణ భారతీయ పౌరులకు రూ.2 కోట్ల లోపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్‌పై 2.50 శాతం వడ్డీ ఇస్తున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ 3 శాతంగా ఉంచింది.
ఇదే కాల పరిమితితో రూ.2 కోట్లకుపైన చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీని (సీనియర్ సిటిజన్స్‌కు కూడా) చెల్లిస్తున్నట్లు పేర్కొంది.
5 ఏళ్లకు పైగా చేసే రూ.2కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేటును సాధారణ ఖాతాదారులకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 5.85 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది ఐసీఐసీఐ బ్యాంక్.
Also read: Gold Price Today: బంగారం ధర తగ్గుముఖం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
Also read: GST Collection November 2021: జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.31 లక్షల కోట్ల ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook