Hero Glamour 2023: ప్రముఖ ద్విచక్ర వాహానాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి మరో కొత్త మోడల్ ను విడుదల చేయనున్నారు. కొత్త హీరో గ్లామర్ నుంచి అప్‌డేట్ చేసిన డిజైన్, ఫీచర్స్, ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది డిస్క్ తో పాటు డ్రమ్ బ్రేక్‌ వేరియంట్స్ ఉన్నాయి. హీరో గ్లామర్ లో డిస్క్ వేరియంట్ ధర రూ. 86,348 ఉండగా.. డ్రమ్ వేరియంట్ ధర రూ. 82,348 (ఎక్స్ షోరూమ్ ధరలు) గా విక్రయిస్తున్నారు. ఇప్పుడీ కొత్త మోడల్స్ మీ దగ్గర్లోని డీలర్స్ దగ్గర అందుబాటులోకి వచ్చాయని హీరో మోటోకార్ప్ సంస్థ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లుక్ ఎలా ఉందంటే?
కొత్త హీరో గ్లామర్ బైక్ లుక్ విషయానికొస్తే.. ఇది గతంలో ఉన్న వెర్షన్ లానే కనిపిస్తోంది. కానీ, ఈ మోడల్స్ లో ష్రౌడ్స్, సింగిల్ పాడ్ రిప్లేక్టర్ హెడ్ లైట్ సెటప్ తో ఉన్న మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ లో సింగిల్ పీస్ గ్రాబ్ - రైల్ తో ఉన్న సింగిల్-పీస్ సీటు రెండు కొత్త డిజైన్ వీల్స్ ఉన్నాయి. 


హీరో గ్లామర్‌లో ఏఏ రంగు మోడల్స్?
హీరో మోటోకార్ప్ విడుదల చేసిన సరికొత్త హీరో గ్లామర్ మోటర్ సైకిల్‌లో మూడు కొత్త కలర్ స్కీమ్స్ పరిచయం చేసింది. వాటిలో క్యాండీ బ్లేజింగ్ రెడ్, స్పోర్ట్స్ రెడ్ - బ్లాక్ తో పాటు టెక్నో బ్లూ-బ్లాక్ రంగుల హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 


Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా.. 


హీరో గ్లామర్ ఇంజిన్..
సరికొత్త గ్లామర్‌లో 125 cc ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 10.8 PS పవర్, 10.6 Nm గరిష్ట టార్క్‌ వరకు తీసుకెళ్తోంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ కనెక్ట్ చేయబడింది. Hero MotoCorp అభివృద్ధి చేసిన i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) సాంకేతికతతో తయారు చేసిన ఈ మోటార్ సైకిల్.. లీటర్ పెట్రోల్ కు 63 కి.మీ. మైలేజీని ఇస్తుంది. 


సరికొత్త హీరో గ్లామర్ ఫీచర్లు
కొత్త హీరో గ్లామర్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఇది రియల్ టైమ్ మైలేజ్, తక్కువ ఆయిల్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. 
కొత్తగా విడుదల చేసిన హీరో గ్లామర్ బైక్స్ పై హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ. రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడారు. "గ్లామర్ బైక్ కు దక్కిన ప్రజాదరణతో దేశంలోని యువతలో స్టైల్, సౌలభ్యంతో నమ్మకపోయిన కస్టమర్లను సొంతం చేసుకుంది. మా వినియోగదారులను ఎప్పుడూ అధునాతన ఉత్పత్తులను అందించడమే మా ముఖ్య ఉద్దేశం. 125 cc బైక్స్ మార్కెట్ విభాగంలో హీరో బ్రాండ్ ఉనికి మరింత బలోపేతం చేస్తుంది. మార్కెట్లో మా వాటాను పెంచేందుకు ఇది సహాయం చేస్తుంది" అని ఆయన అన్నారు.


Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook