Hero HF Deluxe 2023: హీరో నుండి సరికొత్త 100CC బైక్.. ధర 60 వేలు మాత్రమే! సూపర్ మైలేజ్!
Hero HF Deluxe Updated with Best Features. హీరో కంపెనీ తన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ధర రూ. 60,760 నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అద్భుత మైలేజీ కూడా ఇస్తుంది.
Hero HF Deluxe Updated with Best Features: భారత మార్కెట్లో 100సీసీ కమ్యూటర్ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్ కారణంగా సామాన్య ప్రజలు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. హోండా కంపెనీ కొత్త 100సీసీ మోటార్‌సైకిల్ హోండా షైన్ 100ని కొంతకాలం క్రితం విడుదల చేసింది. దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా తన పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ధర రూ. 60,760 నుండి ప్రారంభమవుతుంది. కిక్ స్టార్ట్ వెర్షన్ ధర ఇది. సెల్ఫ్ స్టార్ట్ మోడల్ ధర అయితే రూ. 66,408 నుంచి మొదలవుతుంది.
స్పోర్టియర్ శైలిని ఇష్టపడే వారి కోసం హీరో కంపెనీ హీరో ఎచ్ఎఫ్ డీలక్స్ యొక్క కొత్త కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇది హెడ్‌ల్యాంప్ కౌల్, ఇంజన్, లెగ్ గార్డ్, ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ పైప్, అల్లాయ్ వీల్స్ మరియు గ్రాబ్ రైల్‌తో కూడిన ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక సస్పెన్షన్ క్రోమ్ ఫినిషింగ్‌తో ఈ బైక్ వస్తుంది. హెడ్‌ల్యాంప్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లు మరియు సీట్ ప్యానెళ్ల కింద కొత్త స్ట్రిప్స్ గ్రాఫిక్స్ ఉండనుంది.
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?
కస్టమర్లకు హీరో ఎచ్ఎఫ్ డీలక్స్ బైక్ నాలుగు విభిన్న రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ విత్ హెవీ గ్రే మరియు స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇందులో మీరు యూఎస్బీ ఛార్జర్‌ని ఫీచర్‌లుగా పొందుతారు. ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్ సెల్ఫ్ మరియు సెల్ఫ్ i3S వేరియంట్‌లతో కూడా అందించబడ్డాయి. సైడ్ స్టాండ్ ఇండికేటర్లు మరియు టో గార్డ్స్ ఇతర ఫీచర్లుగా ఇందులో ఉన్నాయి.
హీరో ఎచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది 'ఎక్స్సెన్స్ టెక్నాలజీ'తో కూడిన 97.2cc ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్సెన్స్ ద్వారా మెరుగైన మైలేజ్, ఇంజన్ లైఫ్ టైమ్, స్థిరమైన రైడ్ మరియు తక్కువ నిర్వహణను పొందుతారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8.02 PS శక్తిని మరియు 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 100సీసీ స్ప్లెండర్ ప్లస్‌ను పోలి ఉంటుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హోండా షైన్ మాదిరి 98.98cc ఇంజన్‌తో 7.38PS మరియు 8.05Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook