Hero Xtreme 160R 4V Launch: మార్కెట్లోకి మరో కొత్త బైక్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V
Hero Xtreme 160R 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. అందులో ఒకటి స్టాండర్డ్ కాగా రెండోది కనెక్టెడ్, మూడోది ప్రో వేరియంట్. బేసిక్ వేరియంట్ బైక్ ఖరీదు 1.27 లక్షల రూపాయిలుగా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ బుకింగ్ కోసం 15 జూన్ నుంచి.. అంటే నేటి నుంచే ఓపెన్ అయ్యాయి.
Hero Xtreme 160R 4V Launch: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ కంపెనీ నుంచి కొత్తగా మరొక లేటెస్ట్ బైక్ ఎక్స్‌ట్రీమ్ 160R 4V లాంచ్ అయింది. ఈ బైక్ ఖరీదు రూ. 1 లక్షా 27 వేల నుంచి ప్రారంభం అవుతోంది. హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ బైక్‌లో 163సీసీ BS-VI ఫేజ్ II ఇంజన్ ఇన్‌స్టాల్ చేసి ఉంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. అందులో ఒకటి స్టాండర్డ్ కాగా రెండోది కనెక్టెడ్, మూడోది ప్రో వేరియంట్. బేసిక్ వేరియంట్ బైక్ ఖరీదు 1.27 లక్షల రూపాయిలుగా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ బుకింగ్ కోసం 15 జూన్ నుంచి.. అంటే నేటి నుంచే ఓపెన్ అయ్యాయి. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ డెలివరీ విషయానికొస్తే.. వచ్చే నెల రెండో వారం నుంచే బైక్స్ డెలివరి చేయనున్నట్టు హోరో మోటోకార్ప్ స్పష్టంచేసింది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ హీరో కనెక్ట్ 2.0 బైకులో రిమోట్ ఇమోబిలేజేషన్, ఇన్-యాప్ నేవిగేషన్ లాంటి ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ బైక్ ధర 1.27 లక్ష రూపాయల నుంచి ప్రారంభమై 1.36 లక్ష రూపాయలు వరకు ఉంది. ఇదే హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ కి సంబంధించిన మిడ్ లెవల్ వేరియెంట్ కనెక్టెడ్ బైక్ ధర రూ. 1,32,800 గా ఉంది.
ఇది కూడా చదవండి : Smartphones Under Rs 20K: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్
హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ ప్రీమియం రేంజ్..
హీరో మోటోకార్ప్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V బైక్ గురించి మాట్లాడుతూ, మేం హీరో మోటోకార్ప్ కస్టమర్స్ కి ప్రీమియం మోటార్ సైకిల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని.. అందులో భాగంగానే ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ సిరీస్ లాంచ్ అయింది అని అన్నారు. రాబోయే కాలంలోనూ ప్రీమియం లెవెల్ బైక్స్ పై మరిన్ని మోడల్స్, వేరియంట్స్ తీసుకొచ్చేందుకు తాము ఫోకస్ చేశామని నిరంజన్ గుప్తా తెలిపారు.
ఇది కూడా చదవండి : 4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి