Hero New Splendor 2023: హీరో సరికొత్త స్ల్పెండర్.. ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది! ధర కేవలం 83 వేలే
Hero Super Splendor XTEC launched india at Rs 83368. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ `హీరో మోటోకార్ప్` గతంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది.
Hero Super Splendor XTEC Price and Features: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' గతంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఆ బైక్ పేరు మరేదో కాదు హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్' (Hero Super Splendor XTEC). ఇది కంపెనీ యొక్క సూపర్ స్ల్పెండర్ యొక్క ఫీచర్-ప్యాక్డ్ ఎడిషన్. ఈ బైక్ ధర రూ. 83,368 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభమవుతుంది. అయితే కొనుగోలు చేసే ముందు బైక్ గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
డిజైన్ పరంగా సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ సాధారణ మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే ఇది కొత్త ఆల్-LED హెడ్‌ల్యాంప్ మరియు LED DRLలతో వస్తుంది. సూపర్ స్ల్పెండర్ 125 యొక్క ఎక్స్‌టెక్ వేరియంట్ మూడు రంగులలో లభిస్తుంది. గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ మరియు మ్యాట్ యాక్సిస్ గ్రే రంగులలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా ఈ బైక్ కలిగి ఉంటుంది.
సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ బైక్ ఫ్యూయల్ హెచ్చరిక, మైలేజ్, సర్వీస్ ఇండికేటర్ లాంటి మరిన్నింటిని కలిగి ఉంటుంది. ఈ బైక్ మీ ఫోన్‌లో ఇన్‌కమింగ్ కాల్ మరియు SMS హెచ్చరికలను చూపే బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు పూర్తి డిజిటల్ స్పీడోమీటర్ ఫీచర్లు సాధారణ మోడల్‌లో అందుబాటులో ఉండవు. ఈ బైక్ ఇంజన్ సాధారణ వేరియంట్ వలెనే ఉంటుంది. ఇది 7,500 RPM వద్ద 10.7 bhp గరిష్ట శక్తిని మరియు 6,000 RPM వద్ద 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో వస్తుంది.
సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ లీటరుకు 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ. 83,368 కాగా.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). 125cc హైటెక్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లైన హోండా షైన్, SP 125, హీరో గ్లామర్ 125 వంటి వాటితో ఈ బైక్ పోటీపడుతుంది. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 793 మిమీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.