New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..
New Rules from 2022: కొత్త సంవత్సరం (New year 2022) నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.
New Rules from 2022: నేటితో ఈ ఏడాది ముగియనుంది. రేపు కొత్త సంవత్సరానికి వెల్కం (New year 2022) చెప్పనున్నాం. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికపరంగా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ మార్పులు ఏమిటి? వాటి ప్రభావం మీపై ఎంత ఉండనుంది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎం ఛార్జీలు పెంపు (ATM Charges hike)..
రేపటి నుంచి ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. పరిమితికి మించి చేసే.. ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీల భారం పడనుంది. ప్రస్తుతం పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలపై (నగదు రహిత లావాదేవీలైనా) రూ.20 ఛార్జీ వసూల చేస్తున్నాయి బ్యాంకులు. రేపటి నుంచి ఈ ఛార్జీలు రూ.21కి (ATM new Charges) పెరగనున్నాయి.
లాకర్ల మరింత సురక్షితం..
రేపటి (2022 జనవరి 1) నుంచి బ్యాంక్ లాకర్లు మరింత సురక్షితంగా (New bank locker rules) మారనున్నాయి. ఇకపై లాకర్ల భద్రతపై బ్యాంకుల బాధ్యతలు మరింత పెరగనున్నాయి. ఆర్బీఐ ఇది వరకే జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల లాకర్‌కు ఏదైనా హాని జరిగితే.. అందుకు బ్యాంకు బాధ్యత వహించనుంది. దోపిడితో పాటు భవనం కుప్పకూలడం, అగ్ని ప్రమాదాల వంటివి జరిగినా లాకర్ల బాధ్యత బ్యాంకులదే. దీని ప్రకారం.. సేఫ్ డిపాజిట్ లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు అధిక మొత్తానికి బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫోస్టాఫీస్ డిపాజిట్లపై ఛార్జీల బాదుడు..
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు జనవరి 1 నుంచి ఛార్జీల మోత పడనుంది. పరిమితికి మించి చేసే నగదు డిపాజిట్, విత్‌డ్రా లావాదేవీలపై ఛార్జీలు పెంచుతున్నట్లు ఇదివరకే ఐపీపీబీ వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మూడు రకాల అకౌంట్లను ఇస్తోంది. అవి 1.బేసిక్ సేవింగ్స్ ఖాతా. 2.సేవింగ్స్ ఖాతా. 3.కరెంట్ ఖాతా.
ఈ మూడు ఖాతాల్లో ప్రయోజనాలు, నగదు డిపాజిట్, విత్‌డ్రా పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. ఖాతాను బట్టి ఐపీపీబీ విధించిన పరిమితి కన్న ఎక్కువ డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసిన ఛార్జీలు వర్తిస్తాయి.
పెనాల్టీతో ఐటీఆర్ దాఖలు..
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్) దాఖలు (last date for ITR filing) చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. గడువు తర్వాత రూ.5000-రూ.10 వేల పెనాల్టీతో ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
Also read: Year Ender 2021: రూ.5,000 లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్ కావాలా? వీటిని ట్రై చేయండి..
Also read: EPFO e-nomination: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్- ఈ-నామినేషన్ గడువు పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook