Home Loan Closing Rules: అందుకే చాలామంది వీలైనంత త్వరగా హోమ్ లోన్ క్లోజ్ చేయాలనే కోరుకుంటుంటారు. అయితే హోమ్ లోన్ క్లోజ్ చేసేముందు కొన్ని అంశాల్ని పరిగణలో తీసుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురుకావచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దాన్ని సాకారం చేసుకున్నప్పుడు ఎవరైనా సరే చాలా ఆనందపడతారు. పిల్లల చదువు, మానసిక ఆరోగ్యం తరువాత అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేది సొంత ఇంటి కోసమే. అధిక శాతం ప్రజలు లోన్ తీసుకుని ఇళ్లు నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తుంటారు. ఇంటికి తీసుకున్న రుణం మొత్తం చెల్లించాక లేదా ముందస్తుగా క్లోజ్ చేసినప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిదై ఉంటుంది. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే హోమ్ లోన్ క్లోజింగ్ విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణలో తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.


ఇంటి రుణం నుంచి పూర్తిగా విముక్తి చెందినప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే తరువాత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ ఆస్థిని భవిష్యత్తులో మరొకరికి అమ్మేటప్పుడు ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా ఫాలో కావాలి. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు బ్యాంకుకు మీరు సమర్పించే డాక్యుమెంట్లు వాపసు తీసుకోవడం మర్చిపోకూడదు. సేల్ డీడ్, టైటిల్ డీడ్, పోసెషన్ లెటర్, కన్వీయెన్స్ డీడ్, ట్రాన్స్‌ఫర్ పర్మిషన్, పవర్ ఆఫ్ అటార్నీ, బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్, పేమెంట్ రిసీప్ట్స్ తప్పకుండా ఉండాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. 


మరీ ముఖ్యంగా నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి. ఎన్ఓసీ తీసుకున్న తరువాత మీ పేరు, లోన్ క్లోజింగ్ తేదీ, ప్రోపర్టీ వివరాలు, లోన్ ఎక్కౌంట్ నంబర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి. తరువాత ఇన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ తీసుకోవాలి. ఇది చాలా అవసరం. పోస్ట్ డేటెడ్ సెక్యూరిటీ చెక్స్ ఉంటే వాటిని విత్‌డ్రా చేసుకోవడం మర్చిపోకూడదు. లోన్ క్లోజ్ అయిన తరువాత సంబంధిత బ్యాంకు లేదా సంస్థ క్రెడిట్ బ్యూరోకు అప్‌డేట్ చేశారో లేదో సరిచూసుకోవాలి. హోమ్ లోన్ క్లోజ్ చేసిన నెల తరువాత స్టేటస్‌లో క్లోజ్ అని చూపించాలి. 


Also read: Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook