Home Loan Tips: ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటి రుణం మరింత సులభం, అవేంటో తెలుసుకోండి
Home Loan Tips: సొంతింటి నిర్మాణమనేది ప్రతి ఒక్కరి కల. సొంతింటి కోసం ఎక్కువమంది ఆశ్రయించేది బ్యాంకుల్నే. బ్యాంకు రుణాలు సులభంగా రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Home Loan Tips: ఇంటి రుణం అనేది ప్రస్తుతం చాలా సులభమైంది. రుణం పొందే మార్గాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకులు పోటీపడి మరీ ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం బ్యాంకుల్ని ఆశ్రయించినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుంటే..రుణమార్గం సులభమౌతుంది. ఆ వివరాలు మీ కోసం..
ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం రుణాలిచ్చే బ్యాంకులు చాలానే ఉన్నాయి. ఒక్కో బ్యాంకు ఆఫర్ ఒక్కోలా ఉంటుంది. అదే సమయంలో ఏ మాత్రం చిన్న చిన్న పొరపాట్లు చేసినా మీ బ్యాంకు రుణం తిరస్కరించే అవకాశాలున్నాయి. అందుకే బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తప్పకుండా పరిశీలించాలి. హోమ్ లోన్ అప్లై చేసేముందు ఈ కొన్ని పనుల్ని చేస్తే.. తరువాత మీకు ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. అవేంటో తెలుసుకుందాం.
1. ఒకవేళ మీరు ఎక్కువ రుణం కోసం దరఖాస్తు చేస్తే..బ్యాంకు తిరస్కరించే అవకాశాలున్నాయి. మీకు ఎంతవరకూ రుణం పొందే అర్హత ఉందనేది తెలుసుకోండి. అలా తెలుసుకున్న తరువాత డౌన్‌పేమెంట్ కోసం ప్లాన్ చేసుకోండి.
2. మీరు ఎక్కడైతే ఇళ్లు లేదా ఫ్లాట్ తీసుకుంటున్నారో..దానికి సంబంధించి అన్నిరకాల రెగ్యులేటరీ క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోండి. బ్యాంక్ లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకుకు అప్రూవ్డ్ ప్రోజెక్ట్ లిస్ట్ ఉటుంది. లేకపోతే హోమ్‌లోన్‌పై ప్రభావం పడవచ్చు.
3. మీ సేవింగ్ లేదా సేలరీ అక్కౌంట్ ఉన్న బ్రాంచ్‌లోనే హోమ్‌లోన్ కోసం అప్లై చేయడం మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ బ్యాంకుకు ముందు నుంచీ తెలిసుంటే..రుణం తీసుకోవడం సులభమవుతుంది.
4. ఎక్కువ సందర్భాల్లో మీ రీ పేమెంంట్ హిస్టరీ, మంచి క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ హోమ్‌లోన్ మంజూరు చేస్తుంటుంది. దీనివల్ల మీ హోమ్‌లోన్ త్వరగా మంజూరవుతుంది. చాలా సందర్భాల్లో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ త్వరగా లభిస్తుంది.
5. ఒకవేళ మీకు ఎక్కువ హోమ్‌లోన్ కావల్సి ఉన్నా..మీ శాలరీ ప్రకారం అర్హత ఉండదు. ఆ సందర్భాల్లో మీ భార్య, తల్లిదండ్రులు, సోదరుడు లేదా సోదరితో జాయింట్‌గా తీసుకోవచ్చు. లోన్ రీ పేమెంట్ కోసం ఎక్కువ టెన్యూర్ తీసుకోవచ్చు.
Also read: Pixel Smartwatch: యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు పోటీగా గూగుల్ స్మార్ట్‌వాచ్, పోటీ తట్టుకోగలదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook