COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honda Activa 7G Price: అతి తక్కువ ధరలోనే మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారి గుడ్‌ న్యూస్‌.. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మార్కెట్‌లోకి మరో కొత్త స్కూటర్‌ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్కూటర్‌కి సంబంధించిన పేరు, ఫీచర్స్‌, ధర వంటి వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. హూండా కంపెనీ అద్భుతమైన మైలేజీతో Activa 7Gని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారంగా ప్రకటించ లేదు. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


హోండా యాక్టివా 7G ఫీచర్లు: 
హోండా యాక్టివా 7G స్కూటర్‌ 110 CC ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే లీక్‌ అయిన వివరాల్లో మైలేజీ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ స్కూటర్‌ లీటర్‌కి 65 కి.మీ పైగా ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన బాడీని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం వీల్ బేస్‌తో వస్తోంది. 


ఇక ఈ హోండా యాక్టివా 7G స్కూటర్‌ స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, దీని ముందు చంక్రం 12-అంగుళాల వీల్‌ బేస్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవ చక్రం  10-అంగుళాల వీల్ బేస్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఫ్రంట్‌ భాగంలో ఎల్ఈడీ లైట్‌ సెటప్‌లను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


హోండా Activa 7G ధర వివరాలు:
హోండా యాక్టివా 7G స్కూటర్‌ను కంపెనీ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది రూ.80,000 నుంచి రూ. 1,20,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్కూటర్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్‌ విడుదల తేదికి సంబంధించిన వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. తక్కువ ధరలోనే మంచి స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకా కొన్ని రోజుల పాటు వేయిట్‌ చేయాల్సిందే. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.