Honda City 2023 Price: భారతదేశంలో ప్రముఖ సెడాన్ కార్లకు ఎంతో డిమాండ్‌ ఉంది. అయితే ఈ కార్లలో ఒక్కటైనా హోండా సిటీ మార్కెట్‌లో మంచి పేరుంది. దీని విక్రయాలు లాప్‌లో ప్రతి సంవత్సరం టాప్‌లో ఉంటాయి. అయితే పోయిన సంవత్సరం విడుదల చేసిన కొత్త మోడల్‌ హోండా సిటీ  కస్టమర్ల హృదయాలను దోచుకుంది.  పోయిన ఏడాదిలో కొత్త వేరియంట్‌లో విడుదలైన ఈ కారును కొనుగోలు చేయడానికి ఎంతో ఆశక్తి చూపుతున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. 5వ సిరీస్‌ హోండా సిటీ కారుపై కంపెనీ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు ఇప్పుడే ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ.70,000 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ కారు వచ్చే నెలలో విడుదల కాననుంది. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి ఆఫర్ విషయాలు:
హోండా సిటీ మాన్యువల్, CVT వేరియంట్‌లపై డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు కంపెనీ పేర్కోంది. సిటీ యొక్క మాన్యువల్ వేరియంట్‌లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. హోండా రూ. 30,000 వరకు తక్షణ డిస్కౌంట్‌తో పాటు, రూ. 32,493 విలువైన యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా హోండా రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 లాయల్టీ బోనస్, రూ.8,000 కార్పొరేట్ తగ్గింపు లభించబోతోంది. అంతేకాకుండా ఈ కారుపై ఇతర ఆఫర్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.


సిటీ CVT వేరియంట్‌పై రూ. 20,000 తగ్గింపుతో పాటు, కస్టమర్లు రూ. 21,643 విలువైన ఉచిత యాక్సెసరీలను కూడా పొందవచ్చు. ఈ వేరియంట్‌కు కార్పొరేట్ తగ్గింపుతో పాటు ఇతర లాయల్టీ ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభించే అవకాశాలున్నాయి. డిస్కౌంట్ ఆఫర్ ఈ నెలాఖరు వరకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.


కొత్త హోండా సిటీ ప్రత్యేకత:
కొత్త హోండా సిటీలో ఇంజన్ భారీ మార్పులు చేర్పులు చేశారు. అంతేకాకుండా ముందు భాగంలో ట్వీక్‌ కలిగిన  బంపర్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ మార్కెట్‌లో వస్తోంది. అన్ని కార్లలాగా కాకుండా  స్లిమ్మెర్ క్రోమ్ బార్‌ కూడా ఈ కొత్త వేరియంట్‌లో లభిస్తోంది. కొత్త హోండా సిటీ క్యాబిన్‌లో పెద్దగా మార్పులు చేయబోమని కంపెనీ పేర్కోంది. అంతేకాకుండా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కొత్త సిటీని మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. హోండా కంపెనీ ఈ కారు విషయంలో కీలక ప్రకటన చేసింది. డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ పేర్కోంది.


Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్


Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook