Honda Elevate vs Hyundai Creta: క్రెటా పని అయిపోయినట్లేనా ? లాంచ్ కాకముందే కొత్త SUV కి భారీ సంఖ్యలో బుకింగ్స్
Honda Elevate vs Hyundai Creta : ఇప్పటివరకు కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో రాజ్యమేలుతున్న వాహనాల్లో హ్యూందాయ్ క్రెటా కారు కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇకపై హ్యూందాయ్ క్రెటాకు గేమ్ అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం హోండా నుండి వచ్చిన హోండా ఎలివేట్ కారునే.
Honda Elevate vs Hyundai Creta : ఇప్పటివరకు కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో రాజ్యమేలుతున్న వాహనాల్లో హ్యూందాయ్ క్రెటా కారు కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇకపై హ్యూందాయ్ క్రెటాకు గేమ్ అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం హోండా నుండి వచ్చిన హోండా ఎలివేట్ కారునే. SUV సైజ్ పరంగా, హోండా ఎలివేట్ కారు హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దది. హోండా ఎలివేట్ కారు పొడవు 4,312 mm, వెడల్పు 1790 mm, 1650 mm ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm మేర ఉన్నాయి.
హోండా ఎలివేట్ వెయిటింగ్ పీరియడ్: హ్యుందాయ్ క్రెటా కారు లాంచ్ అయినప్పటి నుండి దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV కారుగా నిలిచింది. ఐతే హ్యూందాయ్ క్రెటా కారుకు పోటీగా త్వరలోనే హోండా ఎలివేట్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ కానుండటమే ప్రస్తుతానికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. హోండా నుండి వస్తోన్న మొట్టమొదటి మిడ్-సైజ్ SUV కారు ఇదే కావడం విశేషం. జపాన్ కి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఇప్పటికే హోండా ఎలివేట్ బుకింగ్స్ సైతం షురూ చేసింది.
హోండా ఎలివేట్ SUV కారుకి జనం నుంచి భారీ స్పందన కనిపిస్తోంది అని ఆ కారు బుకింగ్స్ నెంబర్స్ చూస్తోంటే అర్థం అవుతోంది. పైగా చాలా వరకు ఇతర కార్ల తరహాలో కాకుండా హోండా ఎలివేట్ కారు ఇంకా లాంచ్ కాకముందే వెయిటింగ్ పీరియడ్ జస్ట్ 4 నెలలకు తగ్గడం ఇంకో హైలైట్ గా నిలిచింది.
ఔను సెప్టెంబర్ లో లాంచ్ కానున్న హోండా ఎలివేట్ బుకింగ్స్ జూలైలోనే ప్రారంభం అయ్యాయి. ఇండియన్ మార్కెట్ తో పాటు భారత్ లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారు అని హోండా చెబుతోంది. హోండా ఎలివేట్ SUV కారు SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్స్‌లో లభించనుంది. ఎలివేట్ SUV కారు ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ వంటి 7 సింగిల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
ఇది కూడా చదవండి : Top Electric Cars in India: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితా
హోండా ఎలివేట్ ఇంజన్ విషయానికొస్తే.. హోండా సిటీ సెడాన్ కారులో ఉన్నటువంటి 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ 121 PS పవర్, 145.1 Nm టార్కుని జనరేట్ చేస్తుంది. ఇంజన్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, సివిటితో అందుబాటులో ఉంది. హోండా ఎలివేట్ SUV మాన్యువల్ వేరియంట్ 15.31 kmpl మైలేజీని అందించనుండగా.. CVT వేరియంట్ 16.92 kmpl మైలేజీని అందిస్తుందని హోండా కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి