Elevate Suv Price: హోండా ఎలివేట్ SUV ప్రీ బుకింగ్స్ ప్రారంభం.. లాంచింగ్ తేదీ, మైలేజీ వివరాలు ఇవే
Honda Elevate Suv Price In India: ప్రముఖ హోండా కంపెనీ మార్కెట్లోకి మరో సరికొత్త SUV కారును విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ప్రీ బుకింగ్ కూడా మొదలైంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Elevate Suv Price In India: హోండా మోటార్స్ భారత మార్కెట్లోకి మరో SUVని లాంచ్ చేయబోతుంది. ఈ SUVని ఎలివేట్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది అంతేకాకుండా హోండా ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ కార్ను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రీ బుకింగ్స్ ద్వారా రూ.21,000 చెల్లించి టోకెన్ పొందవచ్చు.
ఎలివేట్‌ను మొత్తం 4 వేరియంట్లలో లాంచ్ చేయబోతున్నట్లు హోండా అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇందులో SV, V, VXతో పాటు ZX వేరియంట్ కూడా కస్టమర్లకు అందుబాటులోకి రాబోతోంది. ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్లకు పోటీగా నిలవబోతోంది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
హోండా ఎలివేట్ నాలుగు వేరియంట్లు 1.5 లీటర్ VTEC పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ 121 PS శక్తితో 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి చాలా రకాల ఫీచర్లతో ఈ కార్ రాబోతోంది. కంపెనీ దీనిని 5వ జనరేషన్ సిటీ ఆర్కిటెక్చర్‌పై రూపొందించింది. ఈ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 11 లక్షలతో వినియోగదారులకు లభించబోతోంది. మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఈ SUV లీటరుకు 17 నుంచి 18 కిమీ వరకు మైలేజ్ ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హోండా ఎలివేట్ ప్రత్యేక ఫీచర్లు:
❋ ట్రిమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
❋ 16 అంగుళాల స్టీల్ వీల్స్
❋ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
❋ LED టైల్‌లైట్లు
❋ పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్
❋ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
❋ గోధుమరంగు ఫాబ్రిక్ అప్హోల్స్టరీ
❋ CVT ట్రాన్స్‌మిషన్
❋ 6 స్పీకర్లు
❋ 7 అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
❋ వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం
❋ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVM
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook