Honda Elevate: హోండా కంపెనీ కార్లంటే క్రేజ్ ఎక్కువ. ఇటీవల గత కొద్దికాలంగా ఆ క్రేజ్ పెరుగుతోంది. హోండా సిటీ, హోండా ఎమేజ్‌లను కాదని మరీ ఆ కొత్త మోడల్ కారు అమ్ముడౌతోంది. అందుకే హోండా సేల్స్ కూడా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో హోండా సత్తా చాటుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోండా కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన హోండా ఎలివేట్ కారుకు ఆదరణ బాగా పెరిగింది. అందుకే కంపెనీ అమ్మకాలు కూడా పెరిగాయి. సెప్టెంబర్ 2023లో హోండా అమ్మకాలు 9,861 యూనిట్లు ఉంది. ప్రతియేటా 13 శాతం వృద్ధి కూడా నమోదవుతోంది. సెప్టెంబర్ 2022లో 8,714 యూనిట్ల అమ్మకాలు జరిగితే ఈ ఏడాది మరింత పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం హోండా ఎలివేట్ కారు. ఈ కారు హోండా సిటీ, హోండా ఎమేజ్‌లు దాటుకుని ముందుకుపోయింది. సెప్టెంబర్ 2023లో హోండా కంపెనీలో అత్యధికంగా విక్రయమైన ఎస్‌యూవీగా నిలిచింది హోండా ఎలివేట్. సెప్టెంబర్ నెలలో 5,685 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 


హోండా ఎలివేట్ ధర 11 లక్షల నుంచి 16 లక్షల మధ్యలో ఉంది. కొత్త ఎలివేట్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత విలువైన మిడ్ సైజ్ ఎస్‌యూనీ. ఇందులో 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. హోండా సిటీలో కూడా ఇదే ఇంజన్ ఉంది. ఇది 119 బీహెచ్‌పి పవర్, 145 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఎలివేట్ మేన్యువల్ వేరియంట్ లీటర్‌కు 15.31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, ఆటోమేటిక్ వేరియంట్ 16.92 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హోండా ఎలివేట్ ARAI ధృవీకృత మైలేజ్ ఇస్తోంది. ఇందులో 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 


హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పాన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంది. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లైన్ కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 


Also read: Nissan Magnite SUV: దేశంలోనే అత్యంత చవకైన ఎస్‌యూవీ ఇదే , బుకింగ్స్ ప్రారంభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook