Honda Discount Offers: హోండా ఇండియాకు చెందిన మూడు కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. హోండా సిటీ, హోండా ఎమేజ్, హోండా, హోండా ఎలివేట్. ఇప్పుడీ మూడు కార్లపై కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వాస్తవానికి హోండా సిటీ, హోండా ఎమేజ్ కార్లపై ఎప్పట్నించో ఆఫర్ ఉన్నా..హోండా ఎలివేట్‌పై కొత్తగా ఆఫర్ ప్రారంభమైంది. మూడు కార్లపై ఏకంగా 1.2 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోండా ఎలివేట్ డిస్కౌంట్ ఆఫర్


హోండా తొలిసారిగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. పూర్తిగా క్యాషడిస్కౌంట్ ఆఫర్ ఇది. ప్రతి మోడల్ కారుపై 50 వేల వరకూ డిస్కౌంట్ ఇస్తోంది. డీలర్‌ను బట్టి డిస్కౌంట్ ఆఫర్ మారవచ్చు.


హోండా ఎమేజ్ డిస్కౌంట్


హోండా ఎమేజ్ ఈ ఏడాది జనవరి నెలలో 2,972 యూనిట్లు విక్రయాలు నమోదయ్యాయి. ఈ సెడాన్ కారుపై కంపెనీ ప్రస్తుతం 90 వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది. హోండా ఎమేజ్ ఎస్ ట్రిమ్ వేరియంట్‌పై 35 వేలు క్యాష్ డిస్కౌంట్ ఉంది. క్యాష్ డిస్కౌంట్ వద్దనుకుంటే 41,653 రూపాయల ఉచిత యాక్సెసరీస్ పొందవచ్చు. దాంతో పాటు ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్ కింద 20 వేలు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద 10 వేల రూపాయలు తగ్గుతుంది. కార్పొరేట్ బోనస్ 6 వేలు, లాయల్టీ బెనిఫిట్ 4 వేలు లభిస్తుంది. టాప్ మోడల్ వీఎక్స్ ఎలైట్‌పై 30 వేల డిస్కొంట్ లబిస్తుంది. 


హోండా సిటీ డిస్కౌంట్


మార్కెట్‌లో అత్యంత క్రేజ్ పొందిన సెడాన్ కారంటే హోండా సిటీ అనే చెప్పుకోవాలి. ఇప్పుుడీ కారుపై భారీ డిస్కౌంట్ అందుతోంది. హోండా సిటీ వేర్వేరు వేరియంట్లపై 1.20 లక్షల వరకూ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. క్యాష్ డిస్కౌంట్ 30 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ 15 వేలు, లాయల్టీ బోనస్ 4 వేలు, ఎక్స్చేంజ్ డీల్ 6 వేలు ఉంటుంది. ఇవి కాకుండా ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్ 20 వేలు లబిస్తుంది. కార్పొరేట్ రిబేట్ రూపంలో మరో 8 వేలు తగ్గుతుంది. 


ప్రస్తుతం హోండా సిటీ, హోండా ఎమేజ్, హోండా ఎలివేట్ కార్లపై లభిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు పరిమిత కాలానికే వర్తించవచ్చు. అందుకే హోండా కార్లు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి ఆవకాశం. ఏకంగా లక్ష రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు.


Also read: Unclaimed Deposits: దేశంలోని వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎంతో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook