Original Rs 500 Note Features: ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించే దురుద్దేశంతో నకిలీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డూప్లికేట్ నోట్లు తయారు చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో మార్చేసుకుంటున్నారు. తాజాగా ఆర్‌బీఐ కూడా తన వార్షిక నివేదికలో నకిలీ నోట్ల చెలమాణి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మందికి నకిలీ నోటును.. ఒరిజనల్ నోటుకు తేడాలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఒరిజనల్ నోట్లను గుర్తించేందుకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఏదైనా లావాదేవీలో నకిలీ నోట్లు వచ్చినట్లయితే.. నోడల్ బ్యాంక్ అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డూప్లికేట్ నోట్లను పోలీసులకు అందజేసి.. మీకు ఎక్కడి నుంచి వచ్చాయో ఫిర్యాదులో పేర్కొనండి. లావాదేవీలో ఐదు నకిలీ నోట్లు దొరికితే నోడల్ అధికారి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. కేసు దర్యాప్తు చేస్తారు. నివేదిక కాపీని బ్యాంక్ ప్రధాన శాఖకు పంపాలి.


ఒరిజినల్ రూ.500 నోటుపై ఇలా ఉంటుంది 


==> నోటు ముందు వైపు.. ఎడమ వైపున కింద ఇచ్చిన ఆకుపచ్చ స్ట్రిప్‌కు కొద్దిగా పైన రెండు రంగుల్లో 500 అని రాసి ఉంటుంది.
==> 500 డినామినేషన్ గుప్త చిత్రం ఆకుపచ్చ గీతపై ముద్రిస్తారు., ఇది నోటును పైకి వంచినప్పుడు కనిపిస్తుంది.
==> దేవనాగరి లిపిలో నోటుపై 500 రూపాయలు అని రాసి ఉంటుంది.
==> నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది.
==> గాంధీ చిత్రంపై భారత్, భారతదేశం అని సూక్ష్మ అక్షరాలతో రాసి ఉంటుంది
==> కలర్ షిఫ్ట్ విండోతో సెక్యూరిటీ థ్రెడ్, నోటును వంచినప్పుడు థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.
==> ఆర్‌బీఐ లోగోతో పాటు  మహాత్మా గాంధీ చిత్రపటం కుడి వైపున ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.
==> నోటుకు కుడివైపున ఇచ్చిన క్రీమ్ వైట్ స్పేస్‌లో గాంధీజీ పోర్ట్రెయిట్, ఎలక్ట్రోటైప్ (500) వాటర్‌మార్క్ ఉంటాయి.
==> గమనిక ఎగువ ఎడమ, దిగువ కుడి వైపున ఆరోహణ ఫాంట్‌లో సంఖ్యలతో కూడిన నంబర్ ప్యానెల్‌ను ఉంటుంది.
==> కుడివైపున అదే క్రీమ్/తెలుపు స్థలంలో రూపాయి గుర్తుతో రంగు మారుతున్న ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)తో 500 గుర్తు ఉంటుంది.
==> నోటుకు కుడివైపున అశోక స్తంభం ఉంటుంది.
==> మహాత్మా గాంధీ చిత్రపటం, అశోక స్తంభం, దాని పైన నల్లటి వృత్తాకారంలో 500 అని రాసి ఉంటుంది. కళ్లులేని దివ్యాంగులు సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది.


Also Read: Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి భారీ రిక్రూట్‌మెంట్‌.. దరఖాస్తు వివరాలు ఇలా..!  


Also Read: Minister Harish Rao: మాటలు కోటలు దాటాయి.. చేతలు పకోడీ చేసినట్లు ఉంది: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి