Search By Date Feature: వాట్సాప్ `సెర్చ్ బై డేట్` ఫీచర్‌తో మీ పని సులభంగా అవుతుంది!
Whatsapp Search By Date Use: ప్రస్తుతకాలంలో చాలా మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ వాట్సాప్‌లో మనం సెర్చ్ బై డేట్ అనే ఫీచర్‌ను చూస్తుంటాము. అయితే దీని వల్ల కలిగే ఉయోగాలు ఏంటో, దీని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Whatsapp Search By Date Use: వాట్సాప్ లో మనం రోజు స్నేహితులతో , కుటుంబ సభ్యులతో చాట్ చేస్తుంటాము. అయితే కొన్ని సార్లు మనం ముఖ్యమైన చాట్‌ను చూడాలి అంటే ఎంతో ఓపికతో స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల టైమ్ మొత్తం వేస్ట్ అవుతుంది.
అయితే మీరు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారా.. అయితే ఈ ఫీచర్ మీకోసం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫీచర్ పేరు 'సెర్చ్ బై డేట్'. దీని వల్ల మీరు కావాల్సిన తేదిని ఎంపిక చేసుకొని మీకు అవసరమైన చాట్‌ను చూడవచ్చు.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి చాలా సులభం.
వాట్సాప్ 'సెర్చ్ బై డేట్' ఫీచర్ ఎలా వాడాలి:
1. వాట్సాప్ ఓపెన్ చేయండి.
2. 'సెర్చ్' బార్ క్లిక్ చేయండి.
3. 'డేట్' ట్యాబ్ ఎంచుకోండి.
4. మీరు సెర్చ్ చేయాలి అనేకొనే తేదీని ఎంచుకోండి.
5. 'సెర్చ్' క్లిక్ చేయండి.
వాట్సాప్ ఆ తేదీలో పంపిన లేదా స్వీకరించిన అన్ని చాట్స్‌ను చూపిస్తుంది.
మరి కొన్ని ఐడియాస్:
మీరు కేవలం తేదిని మాత్రమే కాకుండా మరి కొన్ని విషయాలను కూడా ఇందులో సెర్చ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించి మీ చాట్‌లో వారి పేరును 'సెర్చ్' బార్లో టైప్ చేయండి.
'ఫిల్టర్' ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ చాట్స్‌ను ఫిల్టర్ చేయవచ్చు.
ఉదాహరణకు:
మీరు 2023 డిసెంబర్ 25 న మీ స్నేహితుడికి పంపిన శుభాకాంక్షల సందేశాన్ని సెర్చ్ చేయాలి అంటే 'సెర్చ్' బార్లో '2023 డిసెంబర్ 25' టైప్ చేసి 'సెర్చ్' క్లిక్ చేయండి.
మీరు 'జన్మదినం' అనే పదం కోసం సెర్చ్ చేస్తే, 'సెర్చ్' బార్లో 'జన్మదినం' టైప్ చేసి 'సెర్చ్' క్లిక్ చేయండి.
ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పాత చాట్స్‌ను చూడడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ విధంగా మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించి మీ చాట్స్ అన్ని తిరిగి చూడవచ్చు. దీని కోసం ఇక్కడ చెప్పిన ఫీచర్‌లు వాడుతే సరిపోతుంది.
Also Read: Paytm: పేటీఎం చేయకండి.. వ్యాపారులకు CAIT కీలక సూచన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter