Startups, ఆర్థిక సరళీకరణ విధానాలతో భారత్‌ ఏనాడో ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా మారింది. ఇప్పుడు రాను రాను ప్రతీ ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన కొంత కాలంగా ఇండియాలో యూనికార్న్‌ కంపెనీల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు యూనికార్న్‌ హోదా దక్కించేందుకు దశాబ్ధాల పాటు పడరాని పాట్లు పడే స్టార్టప్‌లు ఇప్పుడు కొన్ని నెలల కాలంలోనే యానికార్న్‌లుగా ఎదిగిపోతున్నాయి. వ్యాపారంలో దూసుకుపోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా సంస్థ మంచి పనితీరుతో పెట్టుబడులను ఆకర్శించి మార్కెట్‌ లో వన్‌ బిలియన్‌ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా అభివర్ణిస్తారు. ఒకప్పుడు ఇలాంటి సంస్థలు యూరప్, ఆమెరికా, జపాన్‌   చైనా దేశాల్లో ఎక్కువగా కనిపించేవి. అప్పుడు భారత్‌లో పర్మిరాజ్‌ వ్యవస్థ నడిచేది. దీంతో ఇక్కడ పెట్టుబుడులు పెట్టాలంటేనే చాలా మంది జంకే వారు. అయితే ఈ పరిస్థితి ఆర్థిక సరళీకరణతో మారిపోయింది. ఆ తర్వాత మార్కెట్ పుంజుకోవడంతో ఈ విధానంపై పాలకుల్లో నమ్మకం కలగడంతో మరిన్ని ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చారు. దీంతో రాను రాను మార్పు వచ్చింది. కాల క్రమంలో స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చే స్థితికి భారత్‌ చేరుకుంది. 2016కు ముందు మన దగ్గర ఏడాదికి ఒక స్టార్టప్‌ కంపెనీ కూడా యూనికార్న్‌ హోదాకు చేరుకునేది కాదు. చిన్న చితకా సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసం చేసే వాళ్లు కాదు.  కానీ 2016 తర్వాత ట్రెండ్ మారిపోయింది. మంచి పేరు, నమ్మకం ఉంటే చాలు వ్యక్తిగత ఇమేజ్ మీద పెట్టుబడులను ఆకర్శించేందుకు అవకాశం ఏర్పడింది. నేటి యువత పెట్టుబడి విషయంలో మునుపటి జనరేషన్స్ మాదిరిగా ఆలోచించడం లేదు. సదరు సంస్థల డైరెక్టర్ల వ్యక్తిగత డాటాను, రెప్యుటేషన్‌ను విశ్లేషించి డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. 


2022 మే వరకు నమోదు అయిన డేటాను పరిశీలిస్తే  ఇప్పుడు దేశవ్యాప్తంగా 69 వేల స్టార్టప్‌ సంస్థలు నమోదు అయ్యాయి. 56 రంగాల్లో ఈ స్టార్టప్‌ కంపెనీలు ఎస్టాబ్లీష్ అయ్యాయి. అయితే వీటిలో ఎక్కువ స్టార్టప్‌లు ఐటీ రంగంలో ఉండగా .... ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్‌ లైఫ్‌ సైన్సెస్‌ వాటా దక్కించుకున్నాయి. ప్రొఫెషనల్‌ అండ్‌ కమర్షియల్‌ సర్వీసెస్‌ , అగ్రికల్చర్‌ , ఎడ్యుకేషన్‌ తో పాటు  ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ రంగాల్లో స్టార్టప్‌ సంస్థలు వచ్చేశాయి. ఇలా పుట్టుకొచ్చిన చాలా స్టార్టప్‌లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టి కాసుల పంట పండిస్తున్నాయి.  ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్న నేటి యువత ఉద్యోగాలు చేయడం కంటే స్టార్టప్‌ సంస్థలు ప్రారంభించి ఎంటర్‌ప్యూనర్లుగా ఎదిగేందుకే ఇష్టపడుతున్నారు. 
 


also read Central Bank Of India:600 బ్రాంచ్‌లను క్లోజ్‌ చేయనున్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా..?


also read Amazon Samsung M12: రూ.549 ధరకే శాంసంగ్ గెలాక్సీ మొబైల్ అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.