Corbevax vaccine: పిల్లలకూ కొర్బీవాక్స్- డీసీజీఐ అనుమతులు మంజూరు!

Corbevax vaccine: దేశీయంగా పిల్లలకోసం మరో కరోనా వ్యాక్సిన్‌కు వినియోగ అనుమతులు లభించాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్ ఈ టీకాకు ఈ అనుమతులు వచ్చాయి.
Corbevax vaccine: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మరో ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. 'బయోలాజికల్ ఈ' అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సోమవారం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.
బయోలాజికల్ ఈ కరోనా వ్యాక్సిన్ కొర్బీవాక్స్(Corbevax)గా అందుబాటులోకి రానుంది. నిజానికి 2021 డిసెంబర్ 28నే ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. తాజాగా.. 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా ఈ టీకాను వేసేందుకు అనుమతులు ఇచ్చింది డీసీజీఐ. దేశీయంగా అభివృద్ధి చేసి.. వినియోగ అనుమతులు పొందిన మూడో వ్యాక్సిన్‌గా కొర్బీవాక్స్ నిలిచింది.
ప్రస్తుతానికి 15 ఏళ్లు ఆపై వయసుల వారికి మాత్రమే!
దేశీయంగా ఈ ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకాలు వేస్తున్నారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే కొర్బీవాక్స్ ఇప్పుడు 12 ఏళ్ల వారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతులు పొందినప్పటికీ.. ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కొన్ని రోజులు 15 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ టీకాలు వేసే అవకాశముంది.
కొర్బీవాక్స్ గురించి..
ఈ వ్యాక్సిన్ కూడా రెండు డోసుల్లో వేయాల్సి ఉంటుంది. రెండు డోసుల మధ్య గ్యాప్ 28 రోజులు. ఈ టీకాను 2-8 డిగ్రీల ఊష్టోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 5 ఎంఎల్ చొప్పున.. మొత్తం 10 ఎంఎల్ ఇవ్వాల్సి ఉంటుంది.
Also read: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ కూల్ ఆఫర్స్.. రూ.12 వేల కూలర్ కేవలం రూ.7,515కే!
Also read: SBI Alert: ఈ ఆరు జాగ్రత్తలతో మీ ఆన్లైన్ పేమెంట్స్ అత్యంత సురక్షితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook