Hyundai Cars: హ్యుండయ్ కార్లపై భారీగా దసరా ఆఫర్లు, ఏకంగా 50 వేల వరకూ డిస్కౌంట్
Hyundai Cars: దసరా వచ్చిందంటే చాలు మార్కెట్‌లో వివిధ రకాల ఆఫర్లు హోరెత్తిస్తుంటాయి. స్మార్ట్ఫోన్లు, బట్టలు, ఆటోమొబైల్ ఇలా అన్ని రంగాల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగానే కార్లపై డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది.
Hyundai Cars: దసరా పండుగ సీజన్ సందర్భంగా మార్కెట్‌లో ఆఫర్లు వెల్లువెత్తుుతన్నాయి. కార్ కంపెనీలు కూడా కస్టమర్లకు ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి. హ్యుండయ్ కంపెనీ అలాంటిదే ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉంది.
దసరా పురస్కరించుకుని హ్యుండయ్ కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. తన కంపెనీ కార్లపై వివిధ రకాల ఆపర్లు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉండటం విశేషం. అయితే అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఉండటంతో కస్టమర్లు త్వరపడాల్సి ఉంటుంది. ఆఫర్ పీరియడ్ దాటితే ధరలో చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది మరి.
హ్యుండయ్ ఐ20 ఎన్ లైన్
హ్యుండయ్ కంపెనీ ఐ20 ఎన్ లైన్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. ఈ మోడల్ కారుపై ఏకంగా 50 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త ఎన్ లైన్ మోడల్‌పై 10 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తోంది. ఇండియాలో ఈ కారు ధర 9.99 లక్షలు రూపాయలుగా ఉంది.
హ్యుండయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుండయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ కారంటే చాలామందికి ఆసక్తి ఎక్కువ. ఇప్పుుడు దసరా పురస్కరించుకుని కారు కంపెనీలు ఈ హ్యాచ్‌బ్యాక్ కారుపై ఏకంగా 43 వేల రూపాయలు ఆఫర్ ఇస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్ ధర 5.84 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
హ్యుండయ్ ఆరా
హ్యుండయ్ ఆర్ కూడా హ్యుండయ్ ఐ10 లాంటిదే. అయితే ఇది పూర్తిగా కాంపాక్ట్ సెడాన్ కారు. అక్టోబర్ 2023లో హ్యుండయ్ కంపెనీ ఈ మోడల్‌పై 33 వేల రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. మారుతి సుజుకి డిజైర్, టాటా టిగోర్, హోండా ఎమేజ్‌తో పోటీ పడే కారు ఇది.
హ్యుండయ్ వెర్నా
హ్యుండయ్ వెర్నా చాలాకాలంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కారు. కారు కంపెనీ ఇటీవలే ఇండియాలో వెర్నా అప్‌డేటెడ్ వెర్షన్ ప్రవేశపెట్టింది. దీని ధర 10.96 లక్షల్నించి ప్రారంభం కానుంది. దసరా పురస్కరించుకుని హ్యుండయ్ వెర్నాపై కంపెనీ 25 వేల రూపాయల ఆఫర్లు ఇస్తోంది.
హ్యుండయ్ అల్‌కజార్
హ్యుండయ్ అల్‌కజార్ అనేది క్రెటా కంటే ఎక్కువ శ్రేణికి చెందిన ఎస్‌యూవీ. ఇదొక 7 సీటర్ ఎస్ యూవీ. ఈ కారు 158 బీహెచ్‌పి పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో 1.5 లీటర్ ఇంజన్ ఉంటుంది. కియా కరెన్స్, కియా సెల్టోస్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంటుంది. దసరా పురస్కరించుకుని కంపెనీ హ్యుండయ్ అల్‌కజార్ కారుపై 20 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది.
Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook