Hyundai Creta 2024 Ev Price: గత కొన్ని సంవత్సరాల నుంచి భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కార్లు మార్కెట్‌లోకి అందుబాటులో రావడం వల్ల చాలా మంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆటో మొబైల్‌ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్యం నడుస్తోంది. భారత్‌ వ్యాప్తంగా ఈ కార్ల విక్రయాలు దాదాపు 70 శాతం ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే హ్యుందాయ్ కూడా తమ కార్ల విక్రయాలను పెంచేందుకు త్వరలోనే మార్కెట్‌లోకి మరో కొత్త కారును విడుదల చేయబోతోంది. హ్యుందాయ్ క్రెటాను కంపెనీ అప్డేట్‌ వేరియంట్‌లో EVలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది 2025 సంవత్సరంలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యుందాయ్ క్రెటా EVను కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే  మారుతి సుజుకి eVXతో పాటు టాటా కర్వ్ EVతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  క్రెటా EV ఎక్స్-షోరూమ్ ధర వివరాల్లోకి వెళితే, కంపెనీ దీనిని రూ.15 లక్షల లోపే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది వివిధ రకాల వేరియంట్స్‌లో రాబోతోంది. ఇక ఈ కారు డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఇది ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకమైన బంపర్‌ను రీడిజైన్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.


త్వరలోనే మార్కెట్‌లోకి రాబోయే హ్యుందాయ్ క్రెటా EV కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీనిని కంపెనీ  500 కిలోమీటర్ల మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కారు లోపలి భాగంలో లెవల్-2 ADAS, డ్యూయల్ పాన్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. దీంతో పాటు స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్‌తో రాబోతోంది. ఇవే కాకుండా అనేక రకాల స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


హ్యుందాయ్ క్రెటా EV వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లుతో రాబోతోది. దీంతో పాటు ముందు భాగంలోనే డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్‌తో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు ఈ కారుకు సంబంధించిన పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే,  డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవేకాకుండా అనేక ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక సమచారాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి