Hyundai Creta Without Gst: GST లేకుండా Hyundai Cretaను కొనుగోలు చేయోచ్చు..రూ.1,63,000 వరకు తగ్గింపు కూడా..
Hyundai Creta Get Without Gst Price: ఆర్మీలో పని చేసేవారి కోసం క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్(CSD)లో అతి తక్కువ ధరలోనే హ్యుందాయ్ క్రెటా అందుబాటులో ఉంది. ఈ క్రెటా అన్ని మోడల్స్‌ను ఆర్మీ అధికారులు రూ. 1,63,000 తగ్గింపుతో పొందవచ్చు.
Hyundai Creta Get Without Gst Price: ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్ మోటార్ పాపులర్, బెస్ట్ సెలింగ్ కార్ క్రెటా SUV క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్(CSD)లో కూడా అందుబాటులో ఉంది. భారత సైన్యం కోసం హ్యుందాయ్ కంపెనీ అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. ఇందులో భారత సైన్యంలో పని చేసే ఎవరైనా క్రెటా SUV అన్ని వేరియంట్స్ భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై జీఎస్‌టీ చెల్లించకుండానే కొనుగోలు చేయోచ్చు. దీంతో పాటు మార్కెట్‌లో లభించే క్రెటా కార్ల ధరల కంటే రూ. 1,63,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్(CSD)లో హ్యుందాయ్ క్రెటా మొత్తం 20 వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్రెటా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10,87,000లుగా ఉంటే CSD వారికి కోసం రూ. 9,81,880కే లభిస్తోంది. బేస్ వేరియంట్‌పై దాదాపు రూ.1,05,120 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక క్రెటా టాప్ మోడల్ ధర విషయానికొస్తే రూ. 19,20,200కాగా..రూ. 17,56,325కి సిఎస్‌డిలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వేరియంట్‌పై ధర రూ.1,63,875కే లభిస్తోంది.
త్వరలోనే మార్కెట్‌లోకి Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ డిజైన్:
మార్కెట్‌లో విడుదల కాబోయే Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ ఫాసియా రిఫ్రెష్ లుక్‌తో రాబోతోంది. అయితే ఈ మోడల్‌లో హెడ్‌లైట్లు, LED DRL, గ్రిల్ డిజైన్‌లో మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ ప్రీమియం గ్రిల్ లుక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు ఫ్రాంట్ లుక్ అచ్చం హ్యుందాయ్ ఎక్సెటర్, హ్యుందాయ్ శాంటా ఫే పోలి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సైడ్ ప్రొఫైల్ కూడా వాటి డిజైన్‌ను పోలి ఉంటుందని సమాచారం. ఇక అల్లాయ్ వీల్స్ విషయానికొస్తే ప్రస్తుత మోడల్ లాగానే అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బంఫర్‌లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ADASలో నూతన ఫీచర్స్:
క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ADAS సాంకేతికతతో వస్తోంది. ఇది ADAS లెవెల్ 2 అప్‌డేట్‌తో రాబోంది. ఇందులో సెల్టోస్ బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్ ఫీచర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిషన్, హైవే డ్రైవింగ్ అసిస్ట్‌తో పాటు స్టాప్ అండ్ గో ఫంక్షన్‌తో నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో 360 సరౌండ్ వ్యూ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇతర ఫీచర్స్:
ADAS భద్రత
360 డిగ్రీ కెమెరా
ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్
కొత్త ఇంటీరియర్ ఫీచర్స్
1.5 లీటర్ టర్బో ఇంజన్
253 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి
ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్
7 స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్
250 Nm అవుట్‌పుట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి