Hyundai Creta: కారు కొనే ఆలోచన ఉన్నప్పుడు చాలామంది బడ్జెట్‌కు అనుగుణంగా ఎక్కువగా బేసిక్ మోడల్ తీసుకుంటుంటారు. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఇతర ఫీచర్లు జోడిస్తుంటారు. ఎందుకంటే బేసిక్ మోడల్ కారు ఇతర వేరియంట్లతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు హ్యుండయ్ క్రెటా బేసిక్ మోడల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ ధరకే హ్యుండయ్ క్రెటా కొనుగోలు చేయాలంటే ఇదే మంచి ఆప్షన్. హ్యుండయ్ క్రెటా బేసిక్ మోడల్ అనువుగా ఉంటుంది. ఇది 1.5 లీటర్ ఎంపీఐ, పెట్రోల్ ఆధారిత ఇంజన్ కలిగి ఉంటుంది. 6 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ కారు ధర కేవలం 10.87 లక్షల రూపాయలు. ఇందులో కనీస ఫీచర్లు తప్పకుండా లభిస్తాయి. ఏమైనా ఫీచర్లు అవసరమనుకుంటే తరువాత యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 


హ్యుండయ్ క్రెటా బేసిక్ మోడల్ ఫీచర్లు


ఇందులో 6 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 113.1 బీహెచ్‌పి శక్తిని 143.8 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ విండో, 6 ఎయిర్‌బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, ఎయిర్ కండీషనింగ్, ఎడ్జస్టబుల్ స్టీరింగ్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ స్పైలర్, ఓఆర్వీఎం వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో టచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ ఉండదు. అవసరమనుకుంటే మీరు తరువాత యాడ్ చేసుకోవాలి.


హ్యుండయ్ క్రెటా ఏ వేరియంట్ ధర ఎంత


హ్యుండయ్ క్రెటా ఇ 10 లక్షల 87 వేలు
హ్యుండయ్ క్రెటా ఈఎక్స్ 11 లక్షల 81 వేల 200
హ్యుండయ్ క్రెటా ఎస్ 13 లక్షల 5 వేల 889 
హ్యుండయ్ క్రెటా ఎస్ ప్లస్ నైట్ డీటీ 13 లక్షల 96 వేల 400
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ 13 లక్షల 99 వేల 500
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ 14 లక్షల 81 వేల 100
హ్యుండయ్ క్రెటా ఎస్ ప్లస్ డీటీ ధర 15 లక్షల 79 వేల 400
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ ఐవీటీ 16 లక్షల 32 వేల 800
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ (ఓ) ఐవీటీ 17 లక్షల 53 వేల 500
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ (ఓ) నైట్ 17 లక్షల 70 వేల 400
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్ ఇ 11 లక్షల 96 వేల 100 రూపాయలు
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్ ఈఎక్స్ 13 లక్షల 24 వేలు
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్ ఎస్ 14 లక్షల 51 వేల 700
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్  ఎస్ ప్లస్ నైట్ డీటీ 15 లక్షల 43 వేల 300
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్ ఎస్ఎక్స్ 16 లక్షల 31 వేల 900
హ్యుండయ్ క్రెటా డీఎస్ఎల్ ఎస్ఎక్స్(ఓ) 17 లక్షల 59 వేల 600
హ్యుండయ్ క్రెటా డఎస్ఎల్ ఎస్ఎక్స్ (ఓ) 19 లక్షల 299 రూపాయలు


Also read: How to Pay Credit Card Bills: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతున్నారా ? ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook