ICICI Bank and PNB Revises MCLR Rates: ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండూ బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) సవరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో లోన్ల వడ్డీ రేట్లను ప్రభావం చూపనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కొన్ని పదవీకాలానికి వడ్డీ రేట్లను తగ్గించగా.. పీఎన్‌బీ అన్ని పదవీకాలాల్లో వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా నిర్ణయించిన వడ్డీ రేట్లు జూన్ 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సవరించిన వడ్డీ రేట్లను ఐసీఐసీఐ బ్యాంక్ తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక నెల ఎంసీఎల్ఆర్‌ను 8.50 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. అంటే 15 బేసిస్ పాయింట్ల తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా నిర్దిష్ట పదవీకాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను పెంచాలని నిర్ణయించింది. బ్యాంక్ ఆరు నెలలు, ఒక సంవత్సరం కాలవ్యవధికి వరుసగా ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం, 8.85 శాతానికి పెంచింది. అంటే ఇంతకంటే తక్కువ వడ్డీరేట్లతో బ్యాంక్ లోన్లు ఇవ్వదు. 


అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అన్ని కాల వ్యవధిలో వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన రేట్లు జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. అంటే 10 bps పాయింట్లు పెంచింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల రేట్లు వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతానికి పెరిగాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌ 8.60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 8.80 శాతం నుంచి 8.90 శాతానికి పెంచింది. 


Also Read: Pawan kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రారంభం  


ఎంసీఎల్ఆర్ రేట్లలో మార్పులు చేయడంతో ఈఎంఐ కాస్ట్ మరింత పెరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఈఎంఐకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఐసీసీఐ బ్యాంక్ రేట్లు తగ్గించిన పదవీకాలంలో వడ్డీ తగ్గుతుంది. ఇది హోమ్ లోన్లు తీసుకున్న వారికి కొంత ఉపశమనం కలిగించవచ్చు.


Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి