ICICI Fixed Deposit Rates: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ బాటలోనే ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) కూడా పయనించింది. ఇటీవల బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposit) వడ్డీరేట్లను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వడ్డీ రేట్లు ఈఏడాది మార్చి 10 నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే ఈ వడ్డీ రేట్లు 2కోట్ల కంటే ఎక్కువ ఉన్న బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సవరించిన వడ్డీ రేట్లు:
* మూడేళ్ల నుంచి పదేళ్ల మధ్య కాల వ్యవధిలో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై అత్యధిక ఎఫ్‌డీ వడ్డీరేటు 4.6 శాతం.
* 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం.
* 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు
* 18 నెలల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.3 శాతం.
* ఏడాది నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్‌డీలపై 4.15 శాతం వడ్డీ రేటు
* ఏడాది లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి.


Also Read: SBI FD Rates: ఎస్​బీఐ గుడ్​ న్యూస్- భారీగా పెరిగిన ఎఫ్​డీ రేట్లు!


పైవిధంగా పేర్కొన్న రేట్లు సాధారణ, సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. మరోవైపు రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ ఖాతాదారులు, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్‌ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారబోవని బ్యాంక్‌ తెలిపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook