How To Sell Old Rupee Notes: ప్రస్తుతం డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు బిజినెస్, ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తే.. ఇంకొందరు కూలీ పనులు, వ్యవసాయం ఇలా రకరకాల పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో ఉద్యోగావకాశాలకు కొదవలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే కలను నెరవేర్చుకోవడానికి వివిధ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే డబ్బు సంపాదించడానికి మీకు మంచి వ్యాపారం లేదా ఉద్యోగం అవసరం లేదు. ఇంట్లోని కూర్చొని కూడా సంపాదించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది ఇంట్లో కూర్చొని పాత నోట్లు, నాణేల ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదూ.. అవును ఇది నిజం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో అనేక వెబ్‌సైట్ల ద్వారా పాత నోట్లు, నాణేలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మీ ఇంట్లో ఉన్న పిగ్గీ బ్యాంకులో పాత నోట్లు, నాణేలు చెక్ చేసుకుని అమ్ముకుంటే మీరు ఒకేసారి లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది.


ఇప్పుడు చాలా మంది పాత 20 రూపాయల నోటు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నోటు కోసం 6 లక్షల రూపాయల చెల్లించేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయండోయ్. నిబంధనల ప్రకారం మీ పాత 20 నోటును విక్రయించకపోతే.. సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. నోటును విక్రయించే ముందు మీరు ముఖ్యమైని విషయాలు తెలుసుకోవాలి. 


ప్రస్తుత ప్రపంచ మార్కెట్‌లో పాత నోటును విక్రయించడానికి కొన్ని ముఖ్యమైన షరతులు పాటించాలి. ఇప్పుడు మార్కెట్లో రూ.20 నోటుకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అయితే ఈ నోటుపై తప్పనిసరిగా సీరియల్ నెంబరు 786 అని ఉండాలి. అంతేకాకుండా ఈ నోటు రంగు కూడా గులాబీ రంగులోనే ఉండాలి. ఇలాంటి నోటు మీ దగ్గరు ఉంటే మీరు సులభంగా ధనవంతులు కావచ్చు.


ఇంతపెద్ద మొత్తం ఖర్చు చేసేంత ఈ సీరియల్ నంబర్‌లో ఏముందని మీరు అనుకోవచ్చు. 786 నంబరును ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లామిక్ సమాజంలో ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ప్రజలు ఈ సిరీస్ నోటును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదృష్టం కలిసివస్తుందని ఈ నంబర్‌తో నోట్లను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. 


ఇలాంటి నోటు మీ దగ్గర ఉంటే ఎక్కడ విక్రయించాలనే ఆలోచనే అవసరం లేదు. మీరు పాత కరెన్సీ నోట్లను ఆన్‌లైన్‌లో సులభంగా అమ్మవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో 20 రూపాయల నోటును విక్రయించాలంటే ముందుగా www.ebay.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక్కడ హోమ్ పేజీలో మీ పేరును మళ్లీ నమోదు చేసుకోవాలి. ఆ తరువాత మీరు విక్రేతగా రిజిస్టర్ చేసుకోవాలి. మీ దగ్గరు ఉన్న 20 నోటు చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి. అంతే కావాల్సిన వాళ్లు మీ నోటును కొనుగోలు చేసేందుకు మిమ్మల్ని సంప్రదిస్తారు. 


Also Read: Cheteshwar Pujara: పుజారా కోసం రోహిత్ శర్మ వికెట్ త్యాగం.. వందో టెస్టులో ప్రత్యేకం  


Also Read:Team India Odi Squad: పదేళ్ల తరువాత వన్డే జట్టులోకి స్టార్ పేసర్ రీఎంట్రీ.. బీసీసీఐ నుంచి పిలుపు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి