Old Currency Buyers: పాత నోట్లు, నాణేల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఎక్కడో ఒకసారైనా చదివే ఉంటారు. వీటిని ఎవరు కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వింటేజ్ (పురాతన) వస్తువులను సేకరించే అలవాటు ఉన్నవాళ్లలో ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. పురాతన వస్తువు ఏది కనిపించినా.. ఎంత డబ్బు ఇచ్చైనా సొంతం చేసుకునేందుకు కొందరు ముందుకొస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో ఇలాంటి కోవకు చెందిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు పురాతన వస్తువులను సేకరించడం హాబీగా (అలవాటు) పెట్టుకుంటారు. ఆ విధంగానే పాత నోట్లు (కరెన్సీ) కొనే వారు కూడా ఉన్నారు. కేవలం ఒక్క కరెన్సీ నోటుకు లక్షల్లో డబ్బును చెల్లిస్తారు. అలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటి ద్వారా లక్షాధికారి అవ్వొచ్చు. అదెలాగో తెలుసుకోండి. 


దాదాపు 26 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోటును ముద్రించడాన్ని ఆపేసింది. అయితే 2015లో తిరిగి రూపాయి నోటును ముద్రించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త రూపాయి నోట్లు కూడా చలామణీ అవుతున్నాయి. అయితే మనకు స్వాతంత్ర్యం రాకముందు అందుబాటులోకి వచ్చిన రూపాయి నోటు గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అప్పటి రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే!


ఈ నోటు ఎందుకంత ప్రత్యేకం?


భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకంతో రూపాయి నోటును ముద్రించారు. అయితే అప్పటి వరకు నాణేలు చలామణీ ఉడడం వల్ల తొలిసారి రూపాయి నోటును దాదాపు 80 ఏళ్ల క్రితం అమలులోకి తీసుకొచ్చారు. గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకం చేసిన ఏకైక నోటు కావడం విశేషం. 1935లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఈ రూపాయి నోటును జారీ చేసింది. ఈ నోటును ఇప్పుడు విక్రయిస్తే దాదాపుగా రూ.7 లక్షలు మీకు దక్కుతాయి. 


రూపాయి నోటును ఎలా విక్రయించాలి?


1) పురాతన కరెన్సీ నోట్లను ఆన్ లైన్ లో OLX యాప్ ద్వారా విక్రయించవచ్చు. 


2) ఈ వెబ్‌సైట్‌లో ఈ అరుదైన నాణేనికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు.


3) మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటును విక్రయించేందుకు ముందు.. OLX వెబ్ సైట్ లో మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి. 


4) ఆ నాణెం లేదా కరెన్సీ నోటును రెండు వైపుల ఫొటోలను సైట్ లో అప్ లోడ్ చేయాలి. 


5) ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి.


6) వెబ్‌సైట్‌లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరిస్తుంది.


7) ఆ నాణెం లేదా కరెన్సీ నోటును కొనుగోలు చేయాలనుకునే ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు. 


Also Read: Budget 2022 Impacts: బడ్జెట్ 2022 ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?


Also Read: Union Budget 2022: బడ్జెట్​కు ముందు హల్వా వేడుకను రద్దు చేసిన మోదీ సర్కారు.. కారణమదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook