Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
savings schemes : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
Bank savings schemes : సాంప్రదాయ బ్యాంక్ పొదుపు పథకాల ద్వారా మీరు డబ్బులు దాచుకుంటున్నారా? అయితే నిజానికి ఇది రిస్క్ లేని రాబడి కోసం మీరు సాంప్రదాయ బ్యాంకింగ్ పథకాల్లో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. తద్వారా మీకు మంచి రాబడి కూడా లభిస్తుంది. అయితే మీరు కాస్త రిస్క్ తీసుకున్నట్లయితే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్లతో లింక్ అయిన ఫండ్స్ వీటిలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, సదరు మ్యూచువల్ ఫండ్ ను నిర్వహించే ఫండ్ హౌస్ ఎంపిక చేసిన స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. వాటిపై వచ్చే రాబడిని మీకు అందజేస్తారు. తద్వారా మీరు స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు.
స్టాక్ మార్కెట్లో మీరు నేరుగా స్టాక్స్ కొన్ని పెట్టుబడి పెట్టాలంటే చాలా రిస్క్ తో కూడిన పని. స్టాక్ మార్కెట్ లోని స్టాక్స్ ను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టాలంటే, మీకు సమయం దక్కదు. ఆ పనిని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చేస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ను నడిపే ఫండ్ మేనేజర్లు మార్కెట్లోని మంచి స్టాక్స్ ని ఎంపిక చేసి వాటిలో మీ డబ్బును ఇన్వెస్ట్ చేసి, ఆపై వచ్చిన రాబడిని మీకు పంచుతారు. తద్వారా సాంప్రదాయ బ్యాంకు పొదుపు కన్నా కూడా వీటిలో లాభం ఎక్కువగా వస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ రూపంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని మీరు ఎంపిక చేసుకున్న మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో అంటే నిర్ణీత కాల వ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
Also Read : Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?
నెలకు కేవలం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి రూ.35 లక్షల ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం:
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా SIP పద్ధతి ద్వారా మీరు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున కనీస పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకోసం మీరు ఎంపిక చేసుకున్న మ్యూచువల్ ఫండ్ లో ప్రతినెల 1000 రూపాయలు సిప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు 30 సంవత్సరాలు చేయగలిగితే అక్షరాల 35 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి.
నిజానికి మీరు నెలకు రూ. 1000 చొప్పున ఏడాది మొత్తం ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం 12 వేల రూపాయలు మాత్రమే. ఈ 12 వేల రూపాయలను 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 3.60 లక్షల రూపాయలు మాత్రమే. కానీ మీ చేతికి మాత్రం 35 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు దాదాపు 31 లక్షల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా అని మీరు ఆలోచించవచ్చు.
సాధారణంగా బ్యాంకులు మీరు పొదుపు చేసిన మొత్తం పై వడ్డీని చెల్లిస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం వడ్డీ బదులుగా రిటర్న్ రేట్ ఉంటుంది. ఈ రిటర్న్ రేటు 12% సంవత్సరానికి అనుకుందాం. ఇది కాంపౌండ్ రూపంలో మీ పెట్టుబడి పై రెట్టింపు అవుతూ చివరికి పెద్ద ఎత్తున కార్పస్ ఫండ్ మీకు లభ్యం అవుతుంది. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మంత్లీ సిప్ ఇన్వెస్ట్ మెంట్ = రూ. 1000
ఏటా రిటర్న్ పొందే శాతం= 12 శాతం ( అంచనా మాత్రమే)
టైం పీరియడ్ = 30 సంవత్సరాలు
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం = రూ. 3,60,000
రిటర్న్ వచ్చే మొత్తం = రూ. 31,69,914
మొత్తం డబ్బు = రూ. 35,29,914
Also Read : SIP : నెలకు రూ. 5000వేలు కడితే చాలు..కోటి రూపాయలు మీ సొంతం..ఎలాగో తెలుసా?
గమనిక: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడులకు జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి హామీ ఇవ్వదు. మీ పెట్టుబడులు పెట్టే ముందు సర్టిఫైడ్ ఇన్వెస్టర్ సలహాలు, సూచనలు పొందడం తప్పనిసరి.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter