Important Last Dates in September 2023: బ్యాంకింగ్, ఆధార్ కార్డు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఇన్‌కమ్ ట్యాక్స్ తదితర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన తుది గడువు తేదీలు ఈ సెప్టెంబర్ నెలలో ముగిసిపోనున్నాయి. అవేంటో తెలుసుకోకపోతే వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోని వారికి ఇబ్బందులు తప్పవు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు పొడిగించగా.. రూ. 2000 నోటు, సేవింగ్స్ స్కీమ్స్‌కి కేవైసీలు చేయించడం వంటి అంశాలకు సంబంధించిన తేదీలకు ముందు నుండే ఈ నెలాఖరు కానుంది.


రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ : 
ప్రస్తుతం మీ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికైనా లేదా బ్యాంకులో ఆ నోట్లను మార్చుకోవడానికైనా ఈ సెప్టెంబర్ నెల 30వ తేదీ చివరి తేదీ కానుంది. ఆలోగా మీరు 2 వేల నోట్లను మార్చుకోలేకపోయినా లేదా డిపాజిట్ చేయలేకపోయినా.. ఆ తరువాత అవి చలామణి కావు. ఇటీవలే ఈ 2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్లపై స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆగస్టు 31వ తేదీ నాటికి 93 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ప్రకటించింది. మరొక 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే జనంలో చలామణిలో ఉన్నాయి అని ఆర్బీఐ స్పష్టంచేసింది. 


సేవింగ్స్ స్కీమ్స్ కేవైసీ : 
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించిన ఖాతాదారులు తమ ఆధార్ కార్డును సబ్మిట్ చేసి కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఈ సెప్టెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఆలోగా పని పూర్తికాకపోతే అక్టోబర్ 1వ తేదీ నుండి ఆయా ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేయనుంది. 


ఫ్రీ ఆధార్ కార్డు అప్ డేట్ : 
ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఆ తరువాత.. అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి జరిగే ఆధార్ కార్డు అప్‌డేట్స్ అన్నింటికి సేవ రుసుం వసూలు చేయనున్నారు.


డీమాట్ ఎకౌంట్ నామినేషన్ : 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు తీసుకున్న డీమాట్ ఖాతాలకు నామిని వివరాలను అప్‌డేట్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీగా ఉంది.


ఇది కూడా చదవండి : Honda Elevate SUV: హోండా నుండి కతర్నాక్ ఎలివేట్ SUV కారు వచ్చేసింది..


అడ్వాన్స్ టాక్స్ రెండో ఇన్‌స్టాల్‌మెంట్ : 
2022 - 23  ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ టాక్స్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు కోసం ఈ నెల 15వ తేదీ తుది గడువు కానుంది. మొత్తం చెల్లించాల్సిన అడ్వాన్స్ టాక్సులో 45 శాతం ఈ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : CIBIL Score And Personal Loan Interest Rates: సిబిల్ స్కోర్‌ని బట్టే పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.