Top Mileage Cars: కారు కొనే ఆలోచన ఉందా..పెట్రోల్, డీజిల్, సీఎన్జీల్లో టాప్ మైలేజ్ కార్లు, వాటి ధరలు
Top Mileage Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కారు కొనడం ఇటీవలి కాలంలో పెద్ద కష్టమేం కాదు. వివిధ బ్యాంకులు సులభమైన ఈఎంఐలతో రుణ సౌకర్యం అందిస్తున్నాయి. కానీ కారు కొనే ముందు ఆ కారు మైలేజ్ ఎంత ఇస్తుందనేది తెలుసుకోవడం చాలా అవసరం.
Top Mileage Cars: కారు మైలేజ్ తెలుసుకోకుండా తొందరపాటులో కారు కొంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే కారు కొనడం కంటే కారును మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే కారు ఇచ్చే మైలేజ్‌ని బట్టి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్‌లో చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్,సెడాన్, ఎస్‌యూవీ, మిడ్ ఎస్‌యూవీ, 6 సీటర్, 7 సీటర్, 8 సీటర్ ఎంపీవీ ఇలా వివిధ రకాల కార్లు వివిధ కంపెనీలో పెట్రోల్, డిజిల్, సీఎన్జీ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే కారు కొనేముందు ఏ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసుకుంటే చాలా మంచిది. అందుకే ఇక్కడ మీ కోసం టాప్ 5 మైలేజ్ కార్ల గురించి వివరాలు అందిస్తున్నాం.
బెస్ట్ పెట్రోల్ మైలేజ్ కార్లు
బెస్ట్ పెట్రోల్ మైలేజ్ కార్లలో మారుతి సెలేరియో, మారుతి ఎస్ ప్రెసో, మారుతి వేగన్ ఆర్ ఉన్నాయి. ఇందులో మారుతి సెలేరియా లీటరుకు 24.97 నుంచి 25.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తకుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5.37 లక్షల నుంచి 7.14 లక్షల వరకూ ఉంటుంది. ఇక రెండవది మారుతి ఎస్ ప్రెసో. ఈ కారు లీటరుకు 25 కిలోమీటర్ల వరకూ ఇస్తుంది. ఈ కారు ధర 4.26 లక్షల్నించి 6.05 లక్షల వరకూ ఉంటుంది. ఇక మూడవది మారుతి వేగన్ ఆర్. ఈ కారు గంటకు 24-25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5.54 లక్షల నుంచి 7.42 లక్షలుంటుంది.
బెస్ట్ డీజిల్ మైలేజ్ కార్లు
బెస్ట్ డీజిల్ మైలైజ్ కార్లలో కియా సోనెట్, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ ఉన్నాయి. ఇందులో కియా సోనెట్ లీటరుకు 19-24 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం దర 9.95 లక్షల్నించి 14.89 లక్షల వరకూ ఉంటుంది. ఇక టాటా నెక్సాన్ కూడా బెస్ట్ డీజిల్ మైలేజ్ కారు. ఈ కారు లీటరుకు 23-24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 10 లక్షల నుంచి 14.50 లక్షలు ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధర 8.15 లక్షల్నించి 10.35 లక్షలుంటుంది.
బెస్ట్ సీఎన్జీ మైలేజ్ కార్లు
ఇక సీఎన్జీ వెర్షన్‌లో మారుతి కార్లు ముందంజలో ఉన్నాయి. మారుతి సెలేరియా లీటర్‌కు 35.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 6.74 లక్షల రూపాయలుంటుంది. ఇక మరో కారు మారుతి వేగన్ ఆర్. ఈ కారు లీటరుకు 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 6.45 లక్షల్నించి 6.89 లక్షలుంటుంది. ఇక మారుతి ఆల్టో సీఎన్జీ లీటరుకు 33.85 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5.96 లక్షలుగా ఉంది.
Also read: Top Safety Features in Car: కార్లలో ఏ సేఫ్టీ ఫీచర్లు ఉండాలి, టాప్ 5 సేఫ్టీ ఫీచర్ల వివరాలు మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook