Benefits of Filing ITR: చాలా మంది ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం అంటే కేవలం టాక్స్ రిఫండ్ కోసం అనే అనుకుంటారు. ఆదాయం ఎక్కువ లేకపోవడం రీత్యానో లేక మరో కారణం వల్లో తమకు రావాల్సిన టాక్స్ రిఫండ్ అంటూ ఏమీ లేనప్పుడు ఇక ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఎందుకులే అని లైట్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఇంతకీ ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల కలిగే ఆ ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చట్టరీత్యా ప్రతీ పౌరుడు, పౌరురాలు తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో ఒకటి. అప్పుడే ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు మీపై  జరిమానా పడకుండా ఉంటుంది.


సులువుగా వీసా 
మీరు ఏదైనా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. మీరు ఏ దేశానికైతే వెళ్తున్నారో, ఆ దేశం వారు ఇచ్చే వీసాకు దరఖాస్తు చేస్తే.. అక్కడి ప్రభుత్వం ముందుగా మీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం మీ ఐటి రిటర్న్స్ డాక్యుమెంట్స్ చూపించాల్సిందిగా కోరుతుంది. అందుకే ఐటి రిటర్న్స్ దాఖలు చేసే వారికి వీసా అవసరమైనప్పుడు ఆర్థికపరమైన చిక్కులు ఛేదించడానికి ఒకరకంగా ఐటి రిటర్న్స్ ఉపయోగపడుతుంది. 


ఇన్‌కమ్ ప్రూఫ్
మీ వార్షిక ఆదాయం ఎంత అని ఎవరైనా అడిగితే మీరు నోటి వెంట చెప్పే సమాధానానికి అంత చట్టబద్ధత ఉండదు. ఒకవేళ మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే.. ఆదాయ పన్ను శాఖ ఇచ్చే సర్టిఫికెట్ మీకు ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్‌గా పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు, బిజినెస్ అవసరాల్లో ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.


లోన్ మంజూరు సులభతరం
మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం కావొచ్చు లేదా బిజినెస్ నీడ్స్ కోసం కావొచ్చు.. ఎప్పుడైనా మీరు పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు మీకు వార్షికంగా ఎంత ఆదాయం వస్తుందో చూపించమని అడుగుతుంటాయి. మీ ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్‌ని విధిగా సబ్మిట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తుంటాయి. అలాంటప్పుడు మీరు ఐటి రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే మీరు రుణం పొందడం సులువు అవుతుంది.


ఇన్సూరెన్స్ కవర్ పెరుగుతుంది
మీరు ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీకు ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ కవర్ కావాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మీ నుంచి అధిక మొత్తంలో ప్రీమియం వసూలు చేయడం మాత్రమే కాకుండా మీ ఐటి రిటర్న్స్ ఫైలింగ్స్ కూడా అడుగుతుంటాయి. 


ఇది కూడా చదవండి : Best Smartphones Under Rs. 10,000: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్


అడ్రస్ ప్రూఫ్
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీకు ఆదాయ పన్ను శాఖ వారు ఒక ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఇస్తారు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా.. ఆ సర్టిఫికెట్‌పై ఉండే మీ అడ్రస్ అత్యవసర సమయంలో మీ భవిష్యత్ అవసరాలకు అడ్రస్ ప్రూఫ్ కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్‌ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ అవడం వల్ల దానిపై ఉండే అడ్రస్ కూడా మీ అడ్రస్ ప్రూఫ్ అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ఇలాంటి మరింత సమాచారం కోసం మా జీ తెలుగు న్యూస్ వెబ్‌సైట్‌లోని బిజినెస్ సెక్షన్‌ని ఫాలో అవుతూ ఉండండి.


ఇది కూడా చదవండి : iphone 14 Pro max Phone: ఈ ఐఫోన్ ధర రూ. 5 కోట్లు.. అంతలా ఏముంది ఇందులో ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK