Tax Saving Tips: ఇన్‌కంటాక్స్ విషయంలో ట్యాక్స్ పేయర్లు ఎప్పుడూ కొన్ని కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలనే సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏఏ రకాల ఆదాయంపై ట్యాక్స్ ఉంటుంది, దేనిపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందనే వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. తద్వారా ప్రతి యేటా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్‌పై కూడా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్‌మెంట్‌‌పై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి జీతంలో హెచ్ఆర్ఏ తీసుకుంటుంటే..మీరు చెల్లించే అద్దెపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అయితే అద్దె రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. 


ఇవి కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై కూడా సెక్షన్ 80డి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీ కుటుంబం మొత్తానికి చెల్లించే ప్రీమియంపై ఇది వర్తిస్తుంది. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా సెక్షన్ 80 సిసిడి ప్రకారం ట్యాక్స్ మినహాయింపుకు వర్తిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా హోసింగ్ లోన్ ప్రీమియం, వడ్డీ రెండింటిపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుపై కూడా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ట్యాక్స్ నుంచి చాలావరకూ రిలీఫ్ లభిస్తుంది. 


Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook