ITR Filing: ఆ పని చేయకపోతే మీ ఐటీ రిటర్న్స్ రిజెక్ట్ అవుతాయి జాగ్రత్త
ITR Filing Tips:ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం నడుస్తోంది. ఐటీ రిటర్న్స్ పైల్ చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే రిటర్న్స్ విషయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి, ఆ వివరాలు మీ కోసం..
ITR Filing Tips: దేశంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ట్యాక్స్ పేయర్లు అంతా 2023-24 ఆర్ధిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం రిటర్న్స్ సమర్పిస్తున్నారు. ఎలాంటి పెనాల్టీ లేకుండా రిటర్న్స్ పైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31. ఆ తరువాత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐటీ రిటర్న్స్ సమయంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలి.
ట్యాక్స్ పేయర్లు అందరూ ప్రతి యేటా జూన్, జూలై నెలల్లో గతించిన ఆర్ధిక సంవత్సరం, వచ్చే ఆర్ధిక సంవత్సరం అసెస్‌మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇదే ఐటీ రిటర్న్స్ ప్రక్రియ. రిఫండ్ రావల్సి ఉంటే అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ సమర్పించేందుకు గడువు తేదీ జూలై 31గా ఉంది. ఆ తరువాత ఫైల్ చేయాలంటే జరిమానా ఉంటుంది. ఏడాది ఆదాయం 5 లక్షలుంటే 1000 రూపాయలు పెనాల్టీ ఉంటుంది. అదే ఏదాది ఆదాయం 5 లక్షలు దాటితే పెనాల్టీ 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ పైల్ చేశాక ఓ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే వెరిఫికేషన్. ఐటీ రిటర్న్స్ ప్రక్రియలో ఇది కీలకమైంది. ఇ వెరిఫికేషన్‌ను 30 రోజుల్లో చేయాల్సి ఉంటుంది.
రిటర్న్స్ పైల్ చేశాక ఇ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే ఐటీఆర్ ప్రక్రియ పూర్తి కానట్టే. 30 రోజుల తరువాత రిజెక్ట్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా ఇ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. బ్యాంక్ ఏటీఎం ద్వారా కూడా ఐటీ రిటర్న్స్ ఇ వెరిఫికేషన్ చేయవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సహాయంతో ఇ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
Also read: LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook