ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరి కొద్దిరోజులే మిగిలుంది. ఇప్పటికీ మీరింకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. అంటే మరో 16 రోజులే మిగిలుంది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే మాత్రం మీకోసం కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ఈ 10 అంశాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది. ఆ తరువాత అంటే జూలై 31 తరువాత రిటర్న్స్ ఫైల్ చేయాలంటే 5 వేల నుంచి 10 వేల వరకూ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో చివరి సమయంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. వీలైనంత త్వరలో ఐటీ రిటర్న్స్ పైల్ చేస్తే మంచిదంటున్నారు ఆర్ధిక నిపుణులు. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా గుర్తుంచుకోవల్సి ఉంటుంది. అంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేముందు తప్పకుండా పరిగణలో తీసుకోవల్సిన 10 అంశాలు ఇవే..
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముఖ్యంగా ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్, ఆదాయం ప్రూఫ్ వంటివన్నీతప్పకుండా సమర్పించాలి.
సరైన ఐటీ రిటర్న్స్ ఫామ్ ఎంచుకోవాలి. మీరు ఉద్యోగులా లేక సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ అనేదానిని బట్టి ఐటీఆర్ ఫామ్ ఎంపిక ఉంటుంది. ఉద్యోగస్థులైతే ఐటీఆర్ 1 ఫైల్ చేస్తారు.
ఆదాయం సోర్స్ అనేది ప్రకటించాలి. జీతం, అద్దె, డిపాజిట్లపై వడ్డీ, డివిడెండ్స్, కేపిటల్ గెయిన్స్ వంటివి తప్పకుండా ప్రస్తావించాలి.
టీడీఎస్ వివరాలు సరిచూసుకోవాలి. ఫామ్ 26 ఏఎస్‌లో టీడీఎస్ వివరాలు, మీ ఆదాయం వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.
డిడక్షన్, మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాలి. సెక్షన్ 80సి, సెక్షన్ 80 డి, సెక్షన్ 80 ఇ ప్రకారం అన్నీ మినహాయింపులు సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి.
మినహాయించిన ఆదాయాన్ని వెల్లడించాలి. అంటే వ్యవసాయ ఆదాయం వంటివి ప్రస్తావించాలి.
సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ అవసరమైతే చెల్లించాలి. రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందే ఇది చెల్లించాలి. తద్వారా పెనాల్టీ, వడ్డీ ఉండదు.
గత ఏడాది నష్టాల్ని ఈ ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రిటర్న్స్ వేలిడేట్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక వెరిఫికేషన్ పూర్తి కాకపోతే రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కానట్టే. ఆధార్ ఓటీపీ, ఈవీసీ, ఐటీఆర్ వి ద్వారా వెరిఫికేషన్ ఉంటుంది.
Also read: Cheap and Best 7 Seater: అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో లభించే 7 సీటర్ ఫ్యామిలీ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook