IT Returns 2022: ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు, చివరి తేదీ ఎప్పుడంటే
IT Returns 2022: మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా. జూలై 31 చివరితేదీగా ఉంది. రిటర్న్స్ చెల్లించేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే జరిమానా తప్పదు.
IT Returns 2022: మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా. జూలై 31 చివరితేదీగా ఉంది. రిటర్న్స్ చెల్లించేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే జరిమానా తప్పదు.
ప్రతియేటా ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆదాయం ట్యాక్సెబుల్ అయితే ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం చాలా అవసరం. 60 ఏళ్లకంటే తక్కువ వయస్సున్నవాళ్లు ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయముంటే ఐటీఆర్ తప్పకుండా ఫైల్ చేయాలి. మరోవైపు ఇన్‌కంటాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ విషయాల్ని పట్టించుకోకపోతే..భారీ నష్టం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది 2021-22 కు ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2022గా ఉంది. వ్యక్తిగతంగా ట్యాక్స్ ఫైల్ చేసేవారికి ఇదే చివరితేదీ. ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకపోతే జరిమానా తప్పదంటున్నారు ఐటీ నిపుణులు. ఆ జాగ్రత్తలేంటో పరిశీలిద్దాం..
ఐటీ రిటర్న్స్‌కు చివరితేదీ
ఒకవేళ మీరు వ్యక్తిగత ట్యాక్స్ పేయర్ల జాబితాలో వస్తే ఈ సంవత్సరం జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ భర్తీ చేయాల్సి ఉంటుంది. గడువు తేదీ తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ శాఖ తరపు నుంచి జారీ అయ్యే ఫామ్ 26ఏఎస్ చాలా అవసరం. ఈ ఫామ్ సహాయంతో వ్యక్తి ఆదాయం, వయస్సు, టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ పెయిడ్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ పెయిడ్ వంటి వివరాలుంటాయి. ఈ ఫామ్ సహాయంతో వేతనజీవులు ఫాన్ 16 సమర్పించాలి. ఫామ్ 26 ఏఎస్ ఉంటే ఐటీ రిటర్న్స్ చెల్లించేటప్పుడు తప్పులకు ఆస్కారముండదు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పెట్టుబడిదారులకు కొద్దిగా మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్లు ఏదైనా మినహాయింపు క్లెయిమ్ చేస్తే అందుకు సంబంధించిన దస్తావేజులు తప్పకుండా ఉంచుకోవాలి. దాంతోపాటు ఐటీ రిటర్న్స్‌లో చూపించే పెట్టుబడులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోతే..ఐటీఆర్ ఫైలింగ్‌లో మినహాయింపు లభించదు.
బ్యాంకింగ్ లావాదేవీలు
మీ బ్యాంకింగ్ లావాదేవీలను ఐటీఆర్‌లో స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీవద్ద 10 లక్షలకంటే ఎక్కువ ఎఫ్‌డి ఉంటే ఆ సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు బ్యాంకుకు సంబంధించిన వివరాలివ్వాలి. లేకపోతే మీ బ్యాంకు ఎక్కౌంట్‌లో రిఫండ్ జమ కావడంలో ఇబ్బంది ఎదురౌతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆస్థుల సమాచారం పూర్తిగా ఇవ్వాలి. ఏది దాచకూడదు. మీ ఆస్థి ట్యాక్సెబుల్ అయితే..ఆ సమాచారం ఐటీ రిటర్న్స్‌లో స్పష్టంగా ఉండాలి. లేకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదురౌతాయి.
Also read: Best Smartphones: బెస్ట్ డిజైన్, ఫీచర్లతో 5 వేలకంటే తక్కువకే మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook