No Tax Income: మనకు వచ్చే ప్రతి ఆదాయంపై ట్యాక్స్ చెల్లించాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ కొన్ని ఆదాయాలపై ట్యాక్స్ ఉండదు. అందుకే ఇన్‌కంటాక్స్ నిబంధనల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి ఆదాయంపై ట్యాక్స్ ఉంటుంది, వేటిపై ట్యాక్స్ ఉండదనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కష్టపడి సంపాదించిన సంపాదనపై ట్యాక్స్ ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో డబ్బులు పోగొట్టుకుంటే ఎవరికైనా నష్టమే అది. దీనికోసం వివిధ రకాల పద్ధతులు అవలంభిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆదాయ వనరులపై ట్యాక్స్ ఉండదు. వారసత్వంగా వచ్చిన సంపదపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రుల్నించి మీకు వారసత్వంగా వచ్చిన ఆస్థి, నగలు, నగదుపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మీ పేరుపై వీలునామా ఉన్నా సరే ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. మీరు స్వయంగా సంపాదించే ఆదాయంపై మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 


వెడ్డింగు గిఫ్టులపై కూడా ట్యాక్స్ ఉండదనేది తెలుసుకోండి. అయితే ఆ వెడ్డింగ్ గిఫ్టు విలువ 50 వేలు దాటితే మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఓ కంపెనీలో పార్టనర్ అయుండి మీ వాటా లేదా లాభం కింద డబ్బులు వస్తే దానిపై ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే మీ పార్టనర్ షిప్ సంస్థ తరపున ట్యాక్స్ చెల్లించేసి ఉంటారు. మరోసారి చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సంస్థ నుంచి మీరు జీతం తీసుకుంటుంటే మాత్రం దానిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 


లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ లేదా మెచ్యూరిటీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే వార్షిక ప్రీమియం అనేది  మొత్తం డబ్బులో 10 శాతం మించకూడదు. లేకపోతే 15 శాతం ట్యాక్స్ ఉంటుంది. అదేవిధంగా ఈక్విటీ, మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 1 లక్ష రూపాయల వరకూ రిటర్న్స్‌పై ఎలాంటి ట్యాక్స్ లేదు. 


Also read: LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook