IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పొరపాట్లు తరువాత ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకునే పరిస్థితి ఏర్పడవచ్చు.  లావాదేవీలపై మినహాయింపులు, ఆదాయ వివరాలు వంటివి సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం ప్రారంభమైంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ప్రక్రియ ఇది. కొంతమంది ఇప్పటికే రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రారంభించారు. అదాయ వివరాలు, పన్ను మినహాయింపు అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకుని రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా తరువాత ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. 


ఒకే సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ సమాచారం ఐటీ రిటర్న్స్ సమయంలో కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకునే పరిస్థితి ఉంటుంది. 


ఒకవేళ ట్యాక్స్ పేయర్ 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్థిని నగదు రూపంలో ఒకే ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలు చేస్తే ఆ సమాచారం కచ్చితంగా ఇన్‌కంటాక్స్ శాఖకు చేరుతుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఈ సమాచారాన్ని ఐటీ రిటర్న్స్ సమయంలో తెలియకపర్చకపోతే ఇన్ కంటాక్స్ శాఖ దీనిపై విచారణ చేస్తుంది. 


స్టాక్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ బాండ్స్‌లలో పెట్టుబడులు పెట్టుంటే ఆ సమాచారం కచ్చితంగా ఐటీ రిటర్న్స్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుంటే ఆ సమాచారం ఐటీకు ఇవ్వాలి. 


ఒకే ఏడాదిలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే ఆ సమాచారం ఐటీ రిటర్న్స్ సమయంలో పొందుపరచాలి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోకుండా ఉండాలంటే ఎఫ్‌డి‌లో పెట్టుబడిని ఆన్‌లైన్‌లో ఇవ్వడమే మేలు. 


ట్యాక్స్ పేయర్ క్రెడిట్ కార్డ్ బిల్లు రూపంలో 1 లక్ష రూపాయలు ఒకేసారి చెల్లిస్తే ఆ సమాచారం ఐటీకు ఉండాలి. లేకపోతే ఇన్‌కంటాక్స్ శాఖ నోటీసు పంపిస్తుంది. ఏడాది మొత్తంలో 10 లక్షల వరకూ చెల్లించినా ఐటీ రిటర్న్స్‌లో ఆ సమాచారం పొందుపర్చాలి. 


ఐటీ రిటర్న్స్ ప్రయోజనాలేంటి


ఐటీ రిటర్న్స్ ద్వారానే రిఫండ్ క్లెయిమ్ చేయవచ్చు. ట్యాక్స్ మినహాయింపులు, డిడక్షన్ల ద్వారా ట్యాక్స్ సేవ్ చేయవచ్చు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కావాలంటే ఐటీ రిటర్న్స్ అవసరమౌతాయి. అదిక మొత్తం ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఐటీ రిటర్న్స్ అవసరం. కొన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు.


Also read: Old vs New Tax Regime: పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో ఏది ఎవరు ఎంచుకోవాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook