How To Save Tax: ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు ట్యాక్స్ సేవ్ చేసేందుకు అనేక మార్గాలను అన్వేసిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులు పెట్టి.. పన్ను ఆదా చేసుకుంటారు. దీర్ఘకాలిక పొదుపు కోసం కేంద్ర ప్రభుత్వ పోస్టాఫీసులో అనేక సేవింగ్ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్టుబడిపెడితే.. సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఆదాయపు పన్ను మినహాయింపును అందించే 5 పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఉన్నాయి. వివరాలు ఇలా.. 


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)


ఇటీవల సవరణ తర్వాత పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. పీపీఎఫ్ 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయగల కనీస మొత్తం రూ.500, గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు కంట్రిబ్యూషన్‌కు సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీపై వచ్చే మొత్తం కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది.


సుకన్య సమృద్ధి యోజన (SSY)


సుకన్య సమృద్ధి ఖాతాపై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్


5 సంవత్సరాల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాగా.. 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి రూ.1000. అయితే గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం  5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకంలో 7 శాతం వడ్డీని లభిస్తోంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)


ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీ 7 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. కనీస పెట్టుబడి రూ.100. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను రహితం.


సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)


60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం SCSS సంవత్సరానికి 8 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. సీనియర్ సిటిజన్లు పొదుపు పథకంలో ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ట్యాక్స్ ఫీ కాగా.. దీని ద్వారా వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు.


Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు  


Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి