Tax Saving Tips: ఇలా చేస్తే మీ ఆదాయం 12 లక్షలున్నా సరే నో ట్యాక్స్
Tax Saving Tips in Telugu: ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు పొందాలని కోరుకుంటుంటారు. కొన్ని సూచనలు సరిగ్గా పాటిస్తే తప్పకుండా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Tax Saving Tips in Telugu: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు. ఏం చేయాలో తెలియక చాలామంది ట్యాక్స్ రూపంలో చాలా డబ్బులు పోగొట్టుకుంటుంటారు. వచ్చే ఆదాయంపై ప్లానింగ్ సరిగ్గా ఉంటే కచ్చితంగా ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు.
ప్రతి ఒక్కరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా ఉండాలి. అప్పుడే ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కొన్ని పద్థతులు పాటిస్తే ఆదాయం ఎంత పెరిగినా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కొన్ని రకాల ఖర్చులు, కొన్ని రకాల ఆదాయాలు ట్యాక్స్ పరిధిలో ఉండవు. అందుకే ప్లానింగ్ సరిగ్గా ఉండాలంటారు. ప్లానింగ్ సక్రమంగా ఉంటే మీ ఆదాయంపై అసలు ట్యాక్స్ ఉండదు. ఇన్‌కంటాక్స్ నిబంధనల ప్రకారం ట్యాక్స్ డిడక్షన్లు, ట్యాక్స్ మినహాయింపుల్ని సరిగ్గా వినియోగిస్తే ట్యాక్స్ సేవ్ చేయవచ్చు. ఒకవేళ ట్యాక్స్ కట్ అయితే రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
మీ ఆదాయం 12 లక్షలైనా ఇలా చేస్తే జీరో ట్యాక్స్
జీతంపై ట్యాక్స్ కోత లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్స్ మధ్య సమన్వయం చేసుకోవాలి. మీ ఏడాది జీతం 12 లక్షలుంటే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్ ద్వారా మొత్తం రీయింబర్స్ పొందవచ్చు లేదా ట్యాక్స్ పడకుండా చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడకుండా తప్పించుకోవచ్చు. మీ హెచ్‌ఆర్‌ను సంప్రదించి చేయవచ్చు. కన్వీయెన్స్, ఎల్టీఏ, ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్ బిల్లులు, పెట్రోల్ బిల్లులు, పుడ్ కూపన్ల ద్వారా రీయింబర్స్ పొందవచ్చు. ఎల్టీఏ అనేది ప్రతి రెండేళ్లకోసారి ఉంటుంది. ఇది మీ కనీస వేతనంలో 10 శాతం ఉంటుంది. బేసిక్ శాలరీ 6 లక్షలుంటే ఎల్టీఏ 60 వేలుంటుంది. ఏడాదికి లెక్కేస్తే 30 వేలుంటుంది.
హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేందుకు మూడు పద్దతులుంటాయి. ఈ మూడింటిలో ఏది తక్కువైతే దానిపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. హెచ్ఆర్ఏ అనేది నగరం, పట్టణాన్ని బట్టి మారుతుంది.
కన్వీయెన్స్ అలవెన్స్ ప్రకారం 12 లక్షల జీతం అంటే రీ యింబర్స్‌మెంట్ 1-1.5 లక్షల వరకూ ఉంటుంది. అంటే ఏడాది జీతంలో 1.5 లక్షల రూపాయలు పూర్తిగా ట్యాక్స్ లేకుండా ఉంటుంది. బ్రాడ్‌బ్యాండ్ బిల్లులపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అందుకే దీనిని రీయింబర్స్‌మెంట్‌లో చేర్చాలి. నెలకు 700-1000 రూపాయలు అలవెన్స్ కింద వస్తుంటే ఏడాదికి 10-12 వేలు ఉంటుంది.
ఇక మూడోది ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్. ఇందులో ఫుడ్ బిల్లులు చూపించవచ్చు. మీ జీతం 12 లక్షలుంటే నెలకు 2 వేల చొప్పున ఏడాదికి 24 వేలు మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువుకయ్యే ఖర్చులో యూనిఫాం, పుస్తకాలు, పెట్రోల్ బిల్లులను క్లెయిమ్ చేయవచ్చు. ఇవి కూడా రీయింబర్స్‌మెంట్ కిందకు వస్తాయి. ఇందులో నెలకు 1000 రూపాయల చొప్పున ఏడాదిలో 12 వేలు మినహాయింపు కోరవచ్చు.
మీ జీతం ఏడాదికి 12 లక్షలుంటే అందులో 7.08 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక ట్యాక్స్ పడే ఆదాయం 4.92 లక్షలుంటుంది. ఇప్పుడు ఇన్‌కంటాక్స్ నిబంధనలు వర్తించుకోవాలి. ట్యాక్స్ పడే ఆదాయం 5 లక్షల్లోపుంటే సెక్షన్ 87ఏ ప్రకారం రిబేట్ లభిస్తుంది. 2.5 నుంచి 5 లక్షల వరకూ ఉంటే 5 శాతం ట్యాక్స్ ఉంటుంది. మొత్తం ట్యాక్సెబుల్ ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే 2.5 లక్షలకు 12,500 రిబేట్ లభిస్తుంది. మిగిలిన 2.5 లక్షలు కనీస వేతన పరిమితి అవుతుంది. దాంతో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. అంటే మీ ఆదాయం 12 లక్షలున్నా సరే జీరో ట్యాక్స్ ఉండేలా చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook